ప్రజాదీవెన, నల్గొండ : గ్రామ్య రిసోర్స్ సెంటర్ ఫర్ ఉమెన్ ఆధ్వర్యంలో వన్ బిలియన్ రైసింగ్ క్యాంపెయిన్ ద్వారా మహిళలపై మరియు బాలికలపై హింస నివారణకై నల్లగొండ జిల్లాలోని అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని నవంబర్ 25వ తేదీ నుండి డిసెంబర్ 11వ తేదీ వరకు 16 రోజులపాటు అన్ని గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామాలలో అవగాహన కార్యక్రమాలను మరియు సదస్సులను నిర్వహిస్తున్నట్టు గ్రామ్య డైరెక్టర్ కే సుమలత ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చందంపేట, దేవరకొండ, మల్లేపల్లిమరియు పీఏ పల్లి మండలాలను ఎంపిక చేసినట్లుగా మండలం లోని అన్ని గ్రామ పంచాయతీ పరిధిలోని స్కూల్స్, హాస్టల్స్, కళాశాల విద్యార్థిని లకు మహిళలు, చేతివృత్తులు వ్యవసాయ కార్మికులు, రైతు కూలీలకుఅన్ని రంగాలకు చెందిన మహిళలకు వారికీ ఉన్న చట్టాల పైన అవగాహన కల్పించడం జరుగుతుంది. పిల్లలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2012 గృహహింస చట్టం- 2005,బాల్యవివాహాల నిర్మూలన చట్టం 2016, పనిచేసే చోట మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2017 బాల కార్మిక నిర్మూలన చట్టం 2007 బాలల హక్కుల పైన లేని సమాజ నిర్మూలనకై కోటి గొంతులతో వెలిగెత్తి చాటాలి అనే నినాదంతో అవగాహన కార్యక్రమాలు కల్పించడం జరుగుతుందని ఆమె అన్నారు.
చట్టాల పైన అవగాహనతో పాటు నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి హింస లేని సమాజం కోసం, పరివర్తనలో మార్పు, సమాజం పట్ల అవగాహన, సామాజిక బాధ్యత పెంపొందించడం కోసం ప్రభుత్వ శాఖల సహకారంతో 16 రోజులపాటు ఈ యొక్క క్యాంపెయిన్ నిర్వహించడం జరుగుతుందని ఆమె అన్నారు.ఇట్టి క్యాంపెయిన్ లోని మండలాలకు చెందిన ప్రతి ఒక్క మహిళ పాల్గొని అవగాహన కార్యక్రమాలు ను విజయవంతం చేయాలని, వారి హక్కుల పట్ల వారు అవగాహన పెంపొందించుకొని మెరుగైన జీవనానికి ఉపయోగపడాలని పిలుపునిచ్చారు.