Babu Jagjeevan Ram: ప్రజా దీవెన, నల్లగొండటౌన్: భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ (Babu Jagat Jeevan Ram) 38 వర్ధంతిని శని వారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వ హించారు. నల్లగొండ (Nalgonda) పట్టణంలోని ఎన్జీ కళాశాల ఎదురు గా ఉన్న జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమా లలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి (gummala Mohan Reddy) మాట్లాడుతూ బడు గు, బలహీన వర్గాల సంక్షేమం కో సం జగ్జీవన్ రామ్ ఎంతో కృషి చేశా డని అన్నారు. అణ గారిన వర్గాల కోసం ఆయన ఎన్నో ఉద్యమాలు చేశాడని అన్నారు.
జగ్జీవన్ రామ్ (jagjivan Ram) ఆశయ సాధన కోసం పార్టీ శ్రేణులం తా పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ మున్సిపల్ చైర్మన్ (Nalgonda municipal chairman) బుర్రి ఆ శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, డిసి సిబి డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, నల్లగొండ, తిప్పర్తి మాజీ జెడ్పిటిసిలు వంగూరి లక్ష్మయ్య, పాశం రామ్ ఆ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, కాంగ్రెస్ నాయకులు జూలకంటి సైదిరెడ్డి, గోలి రవి. నంద్యాల వీర బ్రహ్మానంద రెడ్డి, పోలే జయకు మార్, బోగరి రాంబాబు, గురిజ వెంకన్న పాల్గొన్నారు.
*నాగార్జున సాగర్ లో…*
నందికొండ మున్సిపాలిటీ హిల్ (municipality hill)కాలనీలోని నాగార్జునసాగర్ ఎం ఎల్ క్యాంపు కార్యాలయంలో శని వారం బాబు జగ్జీవన్ రావు వర్ధంతి సందర్భంగా నాగార్జునసాగర్ శాసన సభ్యులు కుందూరు జయవీర్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమా లలు వేసి ఘన నివాళులు అర్పిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రావ్ భారతదేశ (India)తొలి దళిత ఉప ప్రధాని గా సమ సమాజ స్థాపనకు కృషి చేసిన కృషివలుడని దళిత బహుజనుల సంక్షేమం కోసం అవిశ్రాంత కృషి చేశారని ఆయన కొనియాడారు.
ఈ కార్యక్రమంలో నందికొండ మున్సిపల్ చైర్ పర్సన్ అన్నపూర్ణ, కౌన్సిలర్ తిరుమల కొండ మోహన్ రావు, ఈర్ల రామకృష్ణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపల్లి శేఖర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు వైన్స్ ప్రసాద్ గడ్డంపల్లి వినయ్ రెడ్డి, రవికుమార్, యువజన కాంగ్రెస్ నాయకులు పగడాల నాగరాజు, ఉంగరాల శ్రీను, ఆదాసు విక్రం తదితరులు పాల్గొన్నారు.