–ఎం.ఎన్.ఎస్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ బైరి నరేష్
Bairi Naresh: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్:మనిషిని మనిషి ఇష్టపడి కలిసి జీవిస్తామనే చేసుకున్న ఒప్పందమే పెళ్లి అని మూఢనమ్మకాల నిర్మూలన సంఘం (Society for the Abolition of Superstitions) జాతీయ అధ్యక్షులు బైరి నరేష్ (Bairi Naresh) అన్నారు.బుధవారం నల్లగొండ పట్టణంలోని స్థానిక అంబేద్కర్ భవన్ లో కులాంతర వివాహితుల సంక్షేమ సంఘం, సామాజిక ప్రజా సంఘాల ఆధ్వ ర్యం లో పెదవూర మండలం దళిత సామాజిక వర్గానికి చెందిన హరి ప్రసాద్, నకిరేకల్ నియోజకవర్గం బి.సి సామాజిక వర్గానికి చెందిన రాజేశ్వరి ల వివాహం చేయడం జరిగింది. వీరిద్దరు పరస్పరం ఇష్టప డి కులాంతర వివాహితుల సంక్షేమ సంఘాన్ని ఆశ్రయించడంతో ఆదర్శ వివాహం (An ideal marriage)చేయడం జరిగింది.ఈ కు లాంతర వివాహానికి ముఖ్య అతి థిగా విచ్చేసిన బైరి నరేష్ మాట్లా డుతూ పెళ్లి అనే బంధం ఈ సమా జాన్ని ముంధుకు తీసుకు పోయే విధంగా ఉండాలని, సమా జానికి ప్రాథమిక మెట్టు కుటుంబం అన్నా రు. వివాహ బంధాలను కులం తో ముడిపెట్టి మానవ సం బంధాలలో అంతరాలను సృష్టిస్తు న్నారన్నా రు. ఇలాంటి కులాంతర వివాహాల ద్వారానే కుల నిర్మూలన జరిగి సమసమానత్వం సాధ్యమై తుంద ని బాబాసాహెబ్ అంబేద్కర్ అన్న విషయాన్ని గుర్తు చేసారు. భారతదేశం లో కులం అన్ని రంగా లలో పట్టిపీడిస్తుందని వారన్నారు.
మనువాదులు సృష్టించిన నిచ్చన మెట్ల కుల వ్యవస్థే ఈ దేశంలో పెద్ద జబ్బును సృష్టించిందన్నారు.ఈ దేశంలో వివాహాలు ఆర్థికంతో ముడిపడి ఉన్నాయని వాటికి ముగింపు పలకాల్సిన అవసరం ఉందన్నారు. కులాంతర వివాహాలు (Inter-caste marriages) చేసుకున్న జంటలపై ఆధిపత్య వర్గాల వారి దాడులు పెరిగిపోతున్నాయని అలాంటి వారికి రక్షణ కల్పించడంలో పాలనా వ్యవస్థలు వైఫల్యం చెందుతున్నాయన్నారు. ఈ సమాజంలో ఉన్న కులం,అంతరాలను,చాదస్థాలను చంపడానికి ఆదర్శ వివాహం చేసుకున్న జంట తమ ప్రయాణాన్ని కొనసాగించాలన్నారు.ఈ దేశంలో ఎంతోమంది ఆదర్శమూర్తులు తమ పిల్లలకు కులాంతర వివాహాలు చేసిన సంఘటనలు అనేకం ఉన్నాయన్నారు. శాస్త్రీయమైన ఆలోచన విధానాల ద్వారానే సమాజంలో మార్పు తద్యమన్నారు.
బాబాసాహెబ్ అంబేద్కర్, పెరియార్ రామస్వామి,నారాయణ (Babasaheb Ambedkar, Periyar Ramaswamy, Narayana) గురు లాంటి మహనీయులు అంతరాలు లేని సమాజాన్ని ఆకాంక్షించారని ఆ వైపుగా నడుచుకోవాలని వారన్నారు.ప్రభుత్వం కూడా ఇలాంటి ఆదర్శ వివాహాలు చేయడానికి వేదికలు ఏర్పాటు చేయాలని వారి విజ్ఞప్తి చేశారు.యువత కూడా నిరాడంబర పెళ్లీలు చేసుకోవాలని అంగు ఆర్పాటాలకు పోవద్దని సూచించారు. తల్లిదండ్రులు పరువు హత్యలు చేయకుండా పిల్లల ఇష్టాలను పరిశీలించి కులాంతర వివాహాలు చేయాలన్నారు.యువత ప్రేమ ఆకర్షణలకు మాత్రమే పరిమితం కాకుండా సమాజంలో ఆదర్శంగా ఉండేవిధంగా వివాహాలు చేసుకోవా లన్నారు.ఈ కార్యక్రమం లో మాజీ మున్సిపల్ చైర్మన్ బొర్ర సుధాకర్ (Borra Sudhakar,), కులాంతర వివాహితుల సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి బొల్లెపల్లి రిటైర్డ్ ఎంప్లాయి దున్నా యాదగిరి, కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున, తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు,కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను, తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షులు మానుపాటి బిక్షమయ్య బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు అయితగోని జనార్దన్ గౌడ్,ఏ.ఈ చిట్యాల రాజు,పి.డి.ఎస్.యు పూర్వ అధ్యక్షులు ఇందూరి సాగర్, మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జిల్లా అధ్యక్షులు కొమ్ము లక్ష్మీనారాయణ,తెలంగాణ స్టూడెంట్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కొండేటి మురళి, కెవిపిఎస్ నాయకులు బొల్లు రవీం దర్, గాదె నర్సింహ్మ తదితరులు పాల్గొన్నారు.