— బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్
Bommagani Dharmabhiksham: ప్రజాదీవెన, నల్గొండ టౌన్: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, స్వాతంత్ర్య సమర యోధుడు కామ్రేడ్ బొమ్మగాని ధర్మభిక్షం 103వ జయంతి సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పూలమాలలతో ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుడిగా, ఎమ్యెల్యేగా, ఎంపిగా, ఆయన సమాజానికి చేసిన సేవలు వెలకట్టలేనివని విద్యార్థి దశ నుంచే రాజకీయాలలో పాల్గొని విద్యార్థులందరిని ఏకం చేసి ధర్మ బిక్షం గౌడ్ జీవిత చరిత్రని పాఠ్యాంశంలో చేర్పించి భావితరాలకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.
అదేవిధంగా ఆయన జయంతి వర్ధంతి కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని బీసీ సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. కమ్యూనిస్టు నాయకునిగా సబ్బండ వర్గాలు, పీడిత ప్రజల హక్కుల కోసం ఆయన ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేశారని అన్నారు. తన జీవితాంతం బడుగు బలహీన వర్గాల కోసం నిలిచి విలువలు కలిగిన నాయకుడుగా ధర్మభిక్షం అందించిన స్పూర్తి నేటి తరాలకూ అనుసరణీయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీసీ రాజ్యాధికార సమితి జిల్లా అధ్యక్షుడు కర్నాటి యాదగిరి, బీసీ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కారింగ నరేష్ గౌడ్ ,బీసీ యువజన సంఘం నాయకులు రావుల రాజేష్ గౌడ్, నర్సింగ్ శివ కోటేష్ గౌడ్ ,నిరంజన్ ,నాగ చారి ,మనోజ్, చింటూ ,పెద్దవోని శీను గౌడ్ ,పేరు శివ శంకర్ గౌడ్, గోపి తదితరులు పాల్గొన్నారు.