Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

BC Student Union:అనుమతుల్లేని ఎస్పిఆర్ పాఠశాలను సీజ్ చేయాలి

–నల్లగొండ జిల్లా బీసీ విద్యార్థి సంఘం

BC Student Union:ప్రజా దీవెన, నల్లగొండ టౌన్ : బీసీ విద్యార్థి సంఘం (BC Student Union)మరియు బిసి రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా విద్యాశాఖ అధికారి (Nalgonda District Education Officer) కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భం గా బీసీ విద్యార్థి సంఘం (BC Student Union) జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఎలాంటి అనుమతులు లేకుండా నల్లగొం డ జిల్లా (nalgnda)కేంద్రంలో దేవరకొండ రోడ్ లో ఎస్. పి .ఆర్ హైస్కూల్ పేరు మీద పాఠశాలను చలాయిస్తు న్నారు దీనికి ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేవు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నడిపిస్తున్న పాఠశాల యజమా నియం పైన చట్టపరమైన చర్యలు తీసుకొని విద్యార్థులకు (students)నష్టం జరగ కుండా చూడాలని విద్యాశాఖ అధికారిని కోరుతున్నాము తన ఇష్టానుసారంగా ప్రవేట్ పాఠశాల (Private School)లను నెలకొల్పి పేద విద్యార్థుల నుండి లక్షల రూపాయలను దండుకుంటున్న ప్రైవేట్ పాఠశాలల యజమాన్యం పైన చర్యలు తీసుకోవాలి అని జిల్లా కలెక్టర్ ని కోరుతున్నాము జిల్లా వ్యాప్తంగా అనేక ప్రైవేట్ పాఠశాలలు ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా చాలాఇస్తున్నారు తక్షణమే జిల్లా కలెక్టర్ చరువచూపి ఇలాంటివి ఎక్కడున్నా తక్షణమే సీజ్ చేసే విధంగా ఆదేశాలు జారీ చేయాలని బీసీ విద్యార్థి సంఘం (BC Student Union) తరఫున డిమాండ్ (demand) చేస్తున్నాం లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో బిసి రాజ్యాధికార సమితి జిల్లా అధ్యక్షుడు కర్నాటి యాదగిరి, విద్యార్థి సంఘం జిల్లా నాయకుడు కొంపల్లి రామన్న గౌడ్, సహదేవ్, ప్రమోద్, మహేష్, పృద్వి, సాయి, రామ్ చరణ్, మల్లికార్జున్, హరికృష్ణ , తరణ్, రవి, రాజు తదితరులు పాల్గొన్నారు.