–బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్
ప్రజా దీవెన నల్లగొండ టౌన్: బీసీలకు విద్యా, ఉద్యోగాల్లో మరియు స్థానిక సంస్థల ఎన్ని కలలో బీసీ రాజకీయ రిజర్వే షన్లను 42 శాతం పెంచుతూ తె లంగాణ రాష్ట్ర అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందడం పట్ల బీసీ యువజన సంక్షేమ సం ఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టె కోలు దీపెందర్ హర్షం ప్రకటిం చారు.
మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలో మిఠాయిలు పం పిణీ చేసి సంబరాలు జరుపుకు న్నారు.ఈ సందర్భంగా కట్టెకోలు దీపెందర్ మాట్లాడుతూ ఈ చట్టం బీసీల మొదటి పోరాట విజయం అని పేర్కొన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లు 42 శాతం పెంచుతూ చట్టం చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రోడ్లు భవనాల శాఖా మాత్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గార్లకు ఇదే సమయంలో ఈ బిల్లు కు బేషరతుగా మద్దతు తెలిపిన బిఆర్ ఎస్, బీజీపీ, ఎంఐఎం, సీపీఐ పార్టీల నేతలకు సమస్త బీసీ సమాజం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా కార్యదర్శి ఎలిజాల వెంకటేశ్వర్లు, నియోజకవర్గ అధ్యక్షుడు బోళ్ల నాగరాజు, ఉపాధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు, జి.శ్రీ రంగారావు, ప్రశాంత్, వేణు, కోటేష్, పవన్ కుమార్, సంతోష్, సాయి, అరవింద్, నవీన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.