Beef Meat: నల్లగొండ రైల్వే స్టేషన్ లో ఉద్రిక్తత
నల్లగొండ రైల్వే స్టేషన్ లో శనివారం రాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. జన్మభూమి ఎక్స్ ప్రెస్ లో గోమాంసం తరలిస్తున్నారనే సమాచారంతో పోలీసులు రైలును ఆపీ సోదాలు నిర్వహించారు.
జన్మభూమి ఎక్స్ ప్రెస్ లో గో మాంసం పట్టివేత
82 బాక్సుల్లో 6వేల కిలోలు పోలీసుల స్వాధీనం
ప్రజాదీవెన, నల్లగొండ: నల్లగొండ రైల్వే స్టేషన్ లో(Railway station)శనివారం రాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. జన్మభూమి ఎక్స్ ప్రెస్ లో గోమాంసం(beef)తరలిస్తున్నారనే సమాచారంతో పోలీసులు రైలును ఆపీ సోదాలు నిర్వహించారు. మొత్తం 82 బాక్సుల్లో గోమాంసం తరలిస్తున్నట్లుగా గుర్తించారు. వైజాగ్ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న జన్మభూమి ఎక్స్ప్రెస్(Janmabhoomi Express)వెళుతోంది.
మొత్తం 82 బాక్సుల్లో 6వేల కేజీల మాంసం ఉన్నట్లుగా సమాచారం. బాక్సులలో ఉన్న మాంసాన్ని వెటర్నరీ డాక్టర్లు, ఫుడ్ ఇన్స్పెక్టర్ లు టెస్టుల కోసం తీసుకొని వెళ్లారు. టెస్టులా అనంతరం అవి ఏ మాంసమో తెలుస్తుందని, వివరాలు త్వరలోనే తెలియపరుస్తామని డీఎస్పీ(DSP)తెలిపారు. ఈ తనిఖీల్లో అదనపు ఎస్పీ రాములు నాయక్, తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు.
Beef meat Nalgonda railway station