–తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ ట్రై బల్ కో- ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ డాక్టర్ బెల్లయ్య నాయక్
Bellaiah Naik: ప్రజా దీవెన, నల్లగొండ: రాష్ట్రంలో వివిధ పథకాల కింద షెడ్యూల్డ్ (Scheduled) తెగల లబ్ధిదారులకు ప్రయోజనం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం బడ్జెట్లో 350 కోట్ల రూ పాయలు కేటాయించిందని తెలం గాణ రాష్ట్ర షెడ్యూల్ ట్రైబల్ కో- ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ డాక్టర్ బెల్లయ్య నాయక్ (Bellaiah Naik)తెలిపారు. సోమవారం అయన నల్గొండ జిల్లా కేంద్రంలో షెడ్యూల్ తెగల అభివృద్ధికై జిల్లాలో అమలు చేస్తున్న పథకాలపై గిరిజన సంక్షేమ అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం మీడి యా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్డ్ తెగల ప్రజల అభివృద్ధి కోసం అనేక సం క్షేమ కార్యక్రమాలను అమలు చేస్తు న్నదని ,ఇందులో భాగంగానే నల్గొం డ జిల్లాలో గిరిజనల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు,వారికి కల్పిం చాల్సిన సౌకర్యాల పై చర్చిం చే నిమిత్తం జిల్లాకు వచ్చినట్లు తెలి పారు.
ఇదివరకే ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలలో పర్యటించడమే కాకుండాఐటీడీఏలలోసమావేశాలు సైతం ఏర్పాటు చేసి గిరిజనుల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్య లపై చర్చించామని ,ఈనెల 30న హైదరాబాదులో రాష్ట్రస్థాయిలో గిరిజన సంఘాల నాయకులతో చర్చించి వారి ఆభిప్రాయాన్ని తీసు కొనున్నామని, 31న గిరిజన ప్రజా ప్రతినిధులతో (Rijana public representatives) సమీక్షించ నున్న మని ,సెప్టెంబర్ 4న కొత్త బడ్జెట్లో కేటాయించిన 350 కోట్ల రూపా యల నిధుల ప్రకారం ఎలాంటి ప్రతిపాదనలు సిద్ధం చేయాలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలి పారు. అక్టోబర్ లో ఆర్థిక చేయూ త, చిన్న మధ్య తరహా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ప్రోత్సాహ పథ కం, భూమి అభివృద్ధి పథకాల కింద లబ్ధిదారుల ఎంపికై నోటిఫికేషన్ జారీ చేస్తామని, మహిళలు, నిరు ద్యోగ యువతీ యువకులు, చదు వుకున్న వారికి ఈ పథకాల కింద లబ్ధి చేకూర్చున్నట్లు ఆయన వెల్ల డించారు. నెలలోపు ఈ ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి నవంబర్లో వారికి ఆర్థిక సహాయం అందించనున్నట్లుతెలిపారు. ఇందుకుగాను యుద్ధప్రతిపదికన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
గత ప్రభుత్వ హయం లో గిరిజనుల అభివృద్ధికి (For tribal development)రూపాయి కేటాయించలేదని అన్నారు. గత ప్రభుత్వం ట్రైకార్ కింద ఎంపిక చేసిన లగ్ధిదారులకు సహకారం అందించేందుకు తమ ప్రభుత్వం 426 కోట్లు మంజూరు చేయడమే కాకుండా, 410 కోట్ల రూపాయలు విడుదల చేసిందని తెలిపారు. గతంలో పెండింగ్లో ఉన్న యూనిట్లన్నింటిని మంజూరు చేస్తామని, అలాగే కొత్త బడ్జెట్ ప్రకారం ప్రతిపాదనలు తీసుకుంటామని ఆయన తెలిపారు .గిరిజనులకు పోడు భూములపై ఆయన మాట్లాడుతూ చట్టప్రకారం దున్నుకొంటున్నవారికి భూములు ఇస్తామని, గతంలో ఇందిరాగాంధీ హయాంలో ఎస్సీ, ఎస్టీలకు 25 లక్షల ఎకరాల అసైన్డ్ భూములను (Assigned lands)ఇవ్వడం జరిగిం దని ,వాటన్నింటికీ పూర్తిస్థాయి ప ట్టాలు, హక్కులు కల్పించాలని రాష్ట్రప్రభుత్వం ఆలోచిస్తున్నదని ఆయన వెల్లడిం చారు.జిల్లా గిరిజన సంక్షేమ ఇం చార్జ్ అధికారి ,హోసింగ్ పి డి రాజ్ కుమార్, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ కోటేశ్వరరావు, ఆర్డిఓ రవి, డిఎస్పి శివరాం రెడ్డి, శంకర్ నాయక్ తదితరులు ఉన్నారు.