–ఎస్ఎల్ బి సి టన్నెల్ పనులు మరిoత వేగవంతం
–ప్రతినెల ప్రాజెక్టు కోసం రూ.14 కోట్లు నిధులు
— గత ప్రభుత్వ నిర్లక్ష్యం వలన పెం డింగ్ ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరిగింది
–మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో కలిసి టన్నెల్ సందర్శించి ప్రాజెక్టు పనులపై సమీక్షలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
Bhatti Vikramarka: ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లాలోని SLBC ప్రాజెక్టుకు నెల వారిగా క్రమం తప్పకుండా నిధులు విడుదల చేసి ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి, ఆర్థిక, విద్యుత్ శాఖ మం త్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలిపా రు. శుక్రవారం అయన రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తంకుమా ర్ రెడ్డి, రోడ్లు భవనాలు, సినిమా టోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంక టరెడ్డి,(Komati Reddy Venka Tareddy రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్రస్థాయి ఇరిగేషన్, విద్యుత్ శాఖ అధికారులతో కలిసి నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలకు సాగునీరు అందించనున్న మన్నేవారిపల్లి వద్ద ఉన్న SLBC సొరంగంను పరిశీలించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమా వేశంలో ఉప ముఖ్యమంత్రి మాట్లా డుతూ SLBC టన్నెల్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ప్రతినెల రూ. 14 కోట్లు అవుతాయని,ఇరిగేషన్ శాఖ అధికారుల అంచనాల మేరకు ప్రతినెల క్రమం తప్పకుండా రూ.14 కోట్ల నిధులను ఆర్థిక శాఖ ద్వారా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఒక క్యాలెండర్ ను ఏర్పాటు చేసుకొని టన్నెల్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరారు. అంతేకాక డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ను సైతం పూర్తి చేస్తామని, భువనగిరి, నియోజకవర్గంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులు,అచ్చంపేట నియోజకవర్గంలోని అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని చేపడుతామని తెలిపారు.నల్గొండ జిల్లాలోని అన్ని ప్రాజెక్టులు పూర్తిచేసి నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. అలాగే బ్రాహ్మణ వెల్లేముల,ధర్మారెడ్డి కాలువ, పిల్లాయిపల్లి కాలువ, బునియాధిగాని కాలువలను పూర్తి చేస్తామని చెప్పారు.
అంతేకాక ఆయా ప్రాజెక్టుల కింద పెండింగ్లో (pending) ఉన్న ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలకు సైతం ప్రాధాన్యత నిచ్చి పరిష్కరిస్తామన్నా రు. నీళ్ల కోసం తెచ్చుకున్న రాష్ట్రంలో ప్రాజెక్టులను పూర్తి చేయ డమే తమ ధ్యేయమని ,అందుకే రాష్ట్రవ్యాప్తంగా ప్రాధాన్యతా క్రమంలో ప్రా జెక్టులను విభజించుకొని నిధులను మంజూరు చేసి వాటి పూర్తికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. SLBCకి సంబం ధించిన మిషన్ రిపేరికి అమెరికాకి వెళ్లి బేరింగ్ తెచ్చేలా చర్యలు తీసుకోవడం జరిగిందని, అంతేకాక 42 కోట్ల రూపాయలను తక్షణ మే విడుదల చేశామని ఆయన తెలిపారు.
SLBC టన్నేల్ పనులను చేస్తూనే టన్నేల్ పనులకు సంబంధం లేకుండా సాగునీరు వచ్చే లిఫ్ట్ ఇరిగేషన్లకు సంబంధించి ఆర్ అండ్ ఆర్ ఫారెస్ట్ క్లియరెన్స్లను పూర్తి చేయాలని, అలాగే నాగార్జునసాగర్ ప్రాజక్ట్ లెఫ్ట్ కెనాల్ లైనింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు. హై లెవెల్ కెనాల్ కు సంబంధించి భూసేకరణ,అటవీ భూముల అనుమతి వంటి వాటికి ప్రత్యేక అంచనాలను రూపొం దించి పంపాలని ఇరిగేషన్ శాఖ అధికారులతో కోరారు. నక్కలగం డి,ఉదయ సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వంటి వాటికి ఒకే ఫైల్లో ప్రతిపాదనలు పంపిస్తే తక్షణమే మంజూరు చేస్తామని, అలాగే SLBCకి ప్రతినెలా అయ్యే బిల్లులను ఆర్థిక శాఖ నుండి ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తామన్నారు.SLBC ప్రపంచంలోనే అతిపెద్ద గ్రావిటీ కెనాల్ అని, 4 లక్షల ఎకరాలకు నీరంధించే ఈ ప్రాజెక్టును గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆలస్యమై ప్రాజెక్టు వ్యయం రూ.4000 కోట్లకు పెరిగిందని అన్నారు. తాము చేపట్టిన జలయజ్ఞం కార్యక్రమంలో మిగిలిన 30, 40 శాతం ప్రాజెక్టులన్నిం టితోపాటు, గత ప్రభుత్వం చేపట్టిన వాటిని సైతం పూర్తి చేస్తామని ఆయన తెలిపారు .
రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి (Uttamkumar Reddy)మాట్లాడుతూ SLBC టన్నెల్ పనులకు సవరించిన అంచనాల ప్రకారం రూ. 4400 కోట్ల పెంచి శుక్రవారం జరిగే క్యాబినెట్ మీటింగ్ లో మంజూరు చేస్తామని ప్రకటించారు. సొరంగం పనుల కోసం అయ్యే ఖర్చును ఏజెన్సీకి సాధ్యమైనంత త్వరగా చెల్లిస్తామని స్పష్టం చేశారు.ఎట్టి పరిస్థితులలో SLBC ప్రాజెక్టు ద్వారా 2027 సెప్టెంబర్ 20 నాటికి సాగు నీటిని అందిస్తామని ఆయన తెలిపారు. ఇకపై డిండి ప్రాజెక్టుపై ప్రతివారం సమీక్షించాల ని ఇరిగేషన్ సెక్రటరీని ఆదేశించా రు.SLBC తో పాటు, డిండి ప్రాజెక్టును సైతం ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తామని అన్నారు.పెండింగ్లో ఉన్న అటవీ శాఖ అనుమతులు తీసుకువ చ్చేందుకు ఢిల్లీ స్థాయిలో చర్యలు తీసుకుంటామని ,ఈ విషయమై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని నల్గొండ పార్లమెంటు సభ్యులు రఘువీర్ రెడ్డిని కోరారు. రెండువైపులా యుద్ధ ప్రాతిపదికన సొరంగం తవ్వకం పనులు చేపట్టాలని, డిండి ప్రాజెక్టును ప్రాధాన్యత ప్రాజెక్టుగా తమ ప్రభుత్వం తీసుకుంటుందని, తగిన స్థాయిలో నిధులు ఇచ్చి పూర్తి చేస్తామని తెలిపారు.
నల్గొండ జిల్లాలో ఉన్న పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి కాల్వ , బునియాది గాని కాలువలు గ్రావిటీ ద్వారా నీటిని అందిస్తాయని, ఈ మూడు కాలువల ద్వారా 365 రోజులు సాగునీరు అందించే అవకాశాలు ఉన్నందున వీటికి వెంటనే ఆమోదం ఇవ్వాలని ఉపముఖ్యమంత్రితో కోరారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అన్ని ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ పనులకు ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామన్నారు. నల్గొండ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులన్ని వేగవంతం చేసేందుకు ప్రత్యేకించి SLBC వద్ద సమీక్షను ఏర్పాటు చేయడం జరిగింద న్నారు. అలాగే అన్ని నియోజ కవర్గాలలోని ఇరిగేషన్ పనులను వేగవంతం చేస్తామని చెప్పారు. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమా టోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడు తూ SLBC హై లెవెల్ కెనాల్ కు సంబంధించి మరమత్తులో ఉన్న 4వ పంపును మూడు రోజుల్లో మరమ్మత్తు పూర్తి చేసి తక్షణమే సాగునీటిని విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు.
ఉదయసముద్రం ,బ్రాహ్మణ వెల్లెముల కింద భూసేకరణకు సంబంధించి రూ.37 కోట్లను విడుదల చేస్తే రెండు నెలల్లో చెరువులన్నింటిని నింపుతామని ,దీని ద్వారా కట్టంగూరు, నార్కెట్ పల్లి మండలాల్లో సుమారు 70 వేల ఎకరాలు చెరువుల ద్వారా పంటలు పండుతాయని తెలిపారు. AMRP శాశ్వత పరిష్కారం కాదని గతంలోనే తాను గుర్తించానని,అందుకే SLBC మాత్రమే శాశ్వత పరిష్కారంగా భావించి 2004లో మేనిఫెస్టోలో చేర్పించడం జరిగిందని, శ్రీశైలం నీరు డెడ్ స్టోరేజ్ కి వెళ్లినప్పటికీ SLBC ద్వారా 4 లక్షల ఎకరాలకు నీరు అందించవచ్చు మంత్రి వివరించారు.SLBCని త్వరితగతిన పూర్తి చేసేందుకు నేలకు రూ.30 కోట్ల నిధులు విడుదల చేయాలని ఉప ముఖ్యమంత్రిని కోరారు. అలాగే నల్గొండ జిల్లాలోని అన్ని ప్రాజెక్టులను ప్రాధాన్యతపై పూర్తి చేయాలని ,ప్రతి నెల SLBC ని సమీక్షించాలని కోరారు.రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా సాగునీరు ఓవర్ ఫ్లో అవుతున్నందున గొట్టిముక్కల, సింగరాజుపల్లి రిజర్వాయర్లను నింపుకోవచ్చని, అలాగే పిళ్లాయిపల్లి కాలువ, బునియాధిగాని కాలువ, ధర్మారెడ్డి కాలువలకు వెంటనే నిధులు మంజూరు చేయాలని కోరారు.
నల్గొండ పార్లమెంట్ సభ్యులు రఘువీర్ రెడ్డి (Raghuveer Reddy). మాట్లాడుతూ డిండి ఇతర ప్రాజెక్టులకు సంబం ధించి కేంద్ర స్థాయిలో ఫారెస్ట్ క్లియరెన్స్లకు ప్రత్యేక అధికారిని నియమించాలని ఇరిగేషన్ శాఖ మంత్రికి సూచించారు.గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా నల్గొండ జిల్లాలోని అన్ని ప్రాజెక్టులు పెండింగ్ లో పడ్డాయని తెలిపా రు.దేవరకొండ నియోజకవ ర్గంలో కొత్తగా మూడు లిఫ్ట్ ఇరిగేష న్లు మంజూరు చేయాలని ఉప ముఖ్యమంత్రితో కోరారు.నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం మాట్లాడుతూ నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా ఆయకట్టు చివరి భూములకు నీరు అందేందుకు మోటార్లను నియంత్రించాలని అప్పుడే చెరువులను నింపు కోవచ్చని అన్నారు.తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ మాట్లాడుతూ తుంగతుర్తి మద్దిరా ల మండలాలలో సాగునీరు అందిం చేందుకు ప్రతిపాదించిన కేతిరెడ్డి కాలువ 50 ఏళ్లుగా ఎవరు పట్టిం చుకోలేదని అన్నారు.
రూ.13 కోట్లను విడుదల చేస్తే కాలువ లైనింగ్ (Canal lining) పూర్తి అవుతుందని తెలిపారు.అచ్చంపేట శాసనసభ్యు లు డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఇదివరకే మంజూరై పరిపాలన అనుమతి వచ్చిందని, త్వరలోనే దానికి శంకుస్థాపన చేయాలని కోరారు. అలాగే తన నియోజకవ ర్గంలో డిండి ప్రాజెక్టుకు సంబంధిం చి హై లెవెల్ బ్రిడ్జ్ ని మంజూరు చేయాలని కోరారు.ఒకటవ డిస్ట్రిబ్యూటరీని ఏర్పాటు చేయాలని, పెండింగ్లో ఉన్న భూసేకరణను పరిష్కరించా లని ,అలాగే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీతో పాటు, ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరారు.
దేవరకొండ శాసనసభ్యులు బాలునాయక్ మాట్లాడుతూ నక్కలగండి ప్రాజెక్టు కింద ఆర్ అండ్ ఆర్ లో భాగంగా మన్నేవారిపల్లె కింద ఇండ్లు కోల్పోయిన వారికి ఇచ్చినట్లుగానే నష్టపరిహారం ఇవ్వాలని తెలిపారు.అలాగే వివిధ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజక్టుల కింద భూములు,ఇండ్లు కోల్పోయిన కుటుంబాలలో గతంలో మైనర్లుగా ఉన్నవారు ప్రస్తుతం మేజర్లుగా అయినందున వారిని కూడా నష్టపరిహారం, ఉపాధి జాబితాలో చేర్చాలని పేర్కొన్నారు. పెండ్లిపాకుల కాల్వ కింద రీ సర్వే (survey) చేయించి అర్హత ఉన్న వారందరికీ ఆర్ అండ్ ఏర్పాటు చేయాలని, అలాగే ఈదులగండిపై సైతం రీసర్వే చేయించి ఆర్ అండ్ ఆర్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. సింగరాజుపల్లి రిజర్వాయర్ కు సంబంధించి పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని, నక్కలగండి కింద ప్రత్యామ్నాయ రోడ్డును ఏర్పాటు చేయాలని అన్నారు. డిండి కింద 400 కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉందని వారికి పునరా వాసం కల్పించాలని కోరారు. నాగా ర్జునసాగర్ శాసనసభ్యులు జై వీర్ రెడ్డి మాట్లాడుతూ నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించి పెండింగ్ లో ఉన్న ఫారెస్ట్ క్లియరెన్స్ ను వెంటనే పరిష్కరించాలని కోరారు.
ఎమ్మెల్సీ కోటిరెడ్డి మాట్లాడుతూ నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్ (Nellical lift irrigation) కు సవరిం చిన అంచనాలను తయారు చేస్తు న్నారని తెలిసిందని ,ఈ ప్రాంతం లోని రైతులు, గిరిజనులకు ఉప యోగపడే విధంగా నూతన ప్రతిపా దనలు ఉండాలని అన్నారు. మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తన నియోజకవర్గానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న ఇరిగేషన్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు.అంతకుముందు చీఫ్ ఇంజనీర్ వి.అజయ్ కుమార్ నల్గొండ జిల్లాలోని ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు .అనంతరం ఉమ్మడి జిల్లాలో విద్యుత్ శాఖకు సంబం ధించి సమస్యలపై సమీక్ష నిర్వహిం చారు.
ఈ సమావేశానికి భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ,ఎమ్మెల్సీ నర్సిరెడ్డి,రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఇంజనీర్ ఇన్ చీఫ్ అనిల్ కుమార్,నల్గొండ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ మాదావత్ సంతోష్, నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, దేవరకొండ ఆర్డిఓ శ్రీరాములు, ఎస్ ఎల్ బి సి నిర్మాణ సంస్థ జయప్రకాష్ పంకజ్ గౌర్, ఎస్ ఎల్ బి సి ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు హాజరయ్యారు