Bhoomi Puja: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: బహుజన యుద్ధ వీరుడు గౌడ (Bahujan war hero Gowda) జాతి ముద్దుబిడ్డ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ (Sardar Sarvai Papanna Goud) విగ్రహాన్ని నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు కతాల గూడెంలో నిర్మించ తలపెట్టినట్లు కమిటీ ప్రకటించింది. ఆ మేరకు ఆదివారం నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాణ కమిటీ అధ్యక్షుడు పాల కూరి సంతోష్ గౌడ్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ స్ఫూర్తితో గౌడ జాతి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి కావాలని ఆకాంక్షించారు. గౌడు, కల్లుగీత కార్మికులకు వైన్ షాపు టెండర్లలో 50 శాతం రిజర్వే షన్ అవకాశం కల్పించాలని, కల్లు గీత వృత్తి రక్షణ కోసం కల్లుగీత కార్మిక సంఘాలకు ఐదు ఎకరాల భూమి ఇచ్చి తాటి, ఈత వనాల పెంపు కోసం ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించాలని కోరారు.
దాతల సహకారంతో (Donor Contribution) రెండు నెలల్లో విగ్ర హావిష్కరణ కార్యక్రమాన్ని చేపడ తామని తెలియజేశారు. ఈ కార్య క్రమంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ (Sardar Sarvai Papanna Goud) విగ్రహ నిర్మాణ కమిటీ ఉపా ధ్యక్షులు పజ్జురి ప్రదీప్ గౌడ్, మాజీ కౌన్సిలర్ దండెంపల్లి సత్త య్య గౌడ్, దండెంపల్లి అనిల్ గౌడ్, సీఐటీయూ జిల్లా సహాయ కార్య దర్శి దండెంపల్లి సత్తయ్య గౌడ్, పజ్జురి పరమేష్ గౌడ్, పజ్జూరి సైదులు గౌడ్ ,బొడిగ జానయ్య గౌడ్, ప్రవీణ్ గౌడ్, మధుగౌడ్, నరసింహ గౌడ్, గోపిగౌడ్, సతీష్ గౌడ్, శివగౌడ్, రాజు గౌడ్, చింటూ గౌడ్, శ్రీను గౌడ్, యాదయ్య గౌడ్, సన్నీ గౌడ్,బాలు గౌడ్, దేవేందర్ గౌడ్, నగేష్ గౌడ్, ఐలయ్య గౌడ్, తదితరులు పాల్గొన్నారు.