Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Minister Kishan Reddy: ముచ్చటగా మూడు స్థానాలు మావే

–జేఏసీ సంఘాలన్నీ బీజేపీకే సంపూర్ణ మద్దతు
–కాంగ్రెస్‌ జాబ్ క్యాలెండర్ అమలు జాడేది
–ఉద్యోగులకు పత్తాలేని పీఆర్సీ, కరువు భత్యాలు
–మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Minister Kishan Reddy: ప్రజా దీవెన, నల్లగొండ: రాష్ట్రంలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముచ్చట లేకుండా మూడు స్థానా ల్లో విధిగా విజయం సాధిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. జేఏసీ సంఘాలన్నీ బీజేపీకి మద్దతు ఇస్తున్నాయని, అందుకే మూడు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను నిలబెట్టామని తెలి పారు. నల్లగొండలో శనివారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భా గంగా జిల్లా పార్టీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ సర్కారు ఒక్క హామీ నెరవేర్చడం లేదన్నా రు. కాంగ్రెస్‌కు జాబ్ క్యాలెండర్ అమలు చేసే చిత్తశుద్ధి లేదని, ఆ శక్తి కూడా లేదని ఆరోపించారు. పీఆర్సీ ఎందుకు ప్రకటించలేదని, 6 డీఏలు ఎందుకు ఇవ్వలేదని నిలదీ శారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ రూ. 8వేల కోట్లు బకాయిలు ఉన్నాయ ని, విద్యార్థినులకు స్కూటీల సంగతి ఏమైందని నిలదీశారు.

మహిళలకు ఇస్తామని హామీనిచ్చిన రూ.2 500 ఎక్కడ అని ప్రశ్నించారు. గురుకుల విద్యాలయాల్లో విద్యా ర్థుల ఆత్మహత్యలు, ఫుడ్ పాయి జన్ ఘటనలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. రైతు భరోసా అరకొర చేశారని, రైతు కూలీలకు రూ.12 వేలు ఏమైందన్నారు. జీవో 317 మీద 50 వేల మంది భవిష్యత్ గందరగోళంగా మారిందని, టీచర్స్ ఎన్నికల్లో ఉపాద్యాయ, అధ్యాపకు లు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉన్నారని తెలిపారు.

ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని, దశాబ్దాలుగా ఉపాధ్యాయులతో సన్ని హిత సంబంధాలున్న సరోత్తమ్ రెడ్డిని గెలిపించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు ప్రాధాన్యం ఇచ్చిం దని, తెలంగాణకు ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా అని రేవంత్ ప్రభుత్వానికి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణలో జాతీయ రహదారుల కోసం లక్షా 20వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. రూ. 80వేల కోట్ల పనులు నిర్మాణంలో ఉన్నాయని వివరించారు. కేంద్రం నుంచి రీజన ల్ రింగ్ రోడ్, మెగా టెక్స్ టైల్ పార్క్, రైల్వే కోచ్ తెచ్చామని ఉద్ఘాటించారు.

ఆర్‌ఆర్‌ఆర్‌కి రూ.26 వేల కోట్లు, జహీరాబాద్‌లో ఇండస్ట్రియల్ కారిడార్, మెగా టెక్స్ టైల్ పార్క్ రైల్వే కోచ్ ఫ్యా క్టరీ, రామగుండంలో యూరియా ఉత్పత్తి కోసం రూ.7 వేల కోట్లు, జాతీయ రహదారులను 32 జిల్లా లతో కేంద్రం అనుసంధానం చేసిం దని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రజల కి ఇచ్చిన హామీలను మాత్రం నెరవే ర్చలేదని, కేంద్రం ఇచ్చిన పథకాల ను రాష్ట్ర పథకాలుగా ప్రచారం చేసుకోవడం కాంగ్రెస్ దివాలాకోరు తనానికి నిదర్శనమని పేర్కొ న్నారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వా లు రూ.10 లక్షల కోట్లు అప్పు చేశారని, కేంద్ర సంస్థల నుంచే వేల కోట్లు రుణాలు ఇచ్చామని, వాటి ద్వారానే ప్రభుత్వాలు నడుస్తున్నా యని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ సమావేశంలో బిజెపి జిల్లా అధ్య క్షుడు నాగం వర్షిత్ రెడ్డి, భువన గిరి, నల్లగొండ పార్లమెంట్ ఇన్చా ర్జిలు బూర నర్సయ్య గౌడ్, శానం పూడి సైదిరెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డి, నాయకులు కాసం వెంకటేశ్వర్లు మాధగోని శ్రీనివాస్ గౌడ్, గోలి మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.