Women’s Reservation Bill: మహిళ రిజర్వేషన్ బిల్ అమలు చేసిన ఘనత మోడీదే
మహిళ రిజర్వేషన్ బిల్లు అమలుచేసిన ఘనత నరేంద్ర మోడీ కే చెందుతుంది
500 ఏండ్ల నిరీక్షణ తర్వాత అయోధ్యలో రామాలయం
కాంగ్రెస్ కు ఓటు వేస్తే కుటుంబ పాలనకు వేసినట్టే
శానంపూడి సైదిరెడ్డి
కుటుంబ సభ్యులతో చెప్పి కమలం పువ్వు కు ఓటు వేయించాలి
కాంగ్రెస్ నాయకులు 370 ఆర్టికల్ కు వ్యతిరేకంగా పనిచేశారు
దేశం లో అల్లోకల్లోలం సృష్టిద్దామనే ఆలోచనలో ఉన్న కాంగ్రెస్ పార్టీని తరిమి కొడదాం
-మూడోసారి ప్రధాని చేయడం లక్ష్యంగా మహిళా మణులు ముందుండాలి
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.. క్లష్టర్ ఇంచార్జ్ బంగారు శృతి
ప్రజా దీవెన నల్గొండ: మహిళ రిజర్వేషన్ బిల్లు అమలుచేసిన ఘనత నరేంద్ర మోడీ కే చెందుతుంది. మోది వాడిన వస్తువులను వేలం వేస్తే వచ్చిన డబ్బులను పెదల అభ్యున్నతి కోసం వాడిన ఘనత కూడా ఆయనదే.500 యేండ్ల నిరీక్షణ తరవాత అయ్యోద్య లో రామాలయం కట్టడం జరిగింది.
కాంగ్రెస్ కు ఓటు వేస్తే కుటుంబ పాలనకు ఓటు వేసినట్టు.అని బిజెపి నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అన్నారు.
శనివారం జిల్లా కేంద్రంలోని బిజెపి కార్యాలయంలో మహిళా శక్తి సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.కమలం పువ్వు గుర్తుకు ఓటు వేస్తే దేశ అభివృద్ధి కి ఓటు వేసినట్లు.. మోదికి (modi)మద్దతు తెలిపినట్టు. దేశ అభిృద్ధికి మద్దతు తెలిపినట్టు అని పేర్కొన్నారు. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి మోడీ కి మద్దతుగ నిలబడాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
అనంతరంకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, క్లష్టర్ ఇంచార్జ్ బంగారు శృతి మాట్లాడుతూ జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో మహిళలు(womens) అందరూ కుటుంబ సభ్యులతో చెప్పి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయించి శానంపూడి సైదిరెడ్డి ని గెలిపించి నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని కావడానికి మన వంతుగా మద్దతు తెలియచేసి ఈ కాంగ్రెస్ కుటుంబ పాలనను అంతం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నాయకులు 370 ఆర్టికల్ కు వ్యతిరేకంగా పనిచేశారు. ట్రిబుల్ తళాఖ్ కు వ్యతిరేకం. సి ఏ ఏ, మహిళా బిల్లుకు, ఎస్సీ వర్గీకరణ కు, శ్రీరామ మందిర నిర్మాణానికి వ్యతిరేకం అని ఆరోపించారు.
ఇతర దేశాలకు సపోర్ట్ చేస్తు మన దేశం లో అల్లోకల్లోలం సృష్టిద్దామనే ఆలోచనలో ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టే సమయం ఆసన్నమైంది. మహిళల కోసం నరేంద్ర మోడీ (Narendra modi)ఎన్నో పథకాలు తీసుకువచ్చారని చిన్న వ్యాపారస్తులకి ముద్ర లోన్లు, విశ్వకర్మ యోజన పథకం లో అన్ని కులాల వారికి కులవృత్తుల వారికి ముఖ్యంగా ఆడవారికి మహిళలకు చేయూతను అందించే విధంగా ఎన్నో అద్భుతమైన పథకాలను ప్రవేశపెట్టి
వికసిత్ భారత్ అనే నినాదంతో ముందుకు దూసుకుపోతుని అన్నారు. నరేంద్ర మోడీ ని మూడోసారి ప్రధాని చేయడం లక్ష్యంగా మహిళా మణులు ముందుండాలని ఈ సందర్భంగా అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షులు కొండేటి సరిత, నల్గొండ పార్లమెంట్ ప్రబారి చాడ శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు భాగ్యరెడ్డి, కంకణాల నివేద రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీదేవి రెడ్డి, మందడి కరుణ, శానంపూడి రజిత, పార్లమెంట్ కన్వీనర్ బండారు ప్రసాద్, కో కన్వీనర్ పిల్లి రామరాజు యాదవ్, నల్గొండ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు రావిరాల కాశమ్మ, శకుంతల, సీనియర్ నాయకురాలు సులోచన, నీరజ, లక్ష్మీప్రసన్న, దాసోజు అరుణ పార్లమెంట్ పరిధిలోని మహిళాలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
BJP implementing Women’s Reservation Bill