Vemula Veeresham: కాంగ్రెస్ లో చేరిన బిజెపి నేత
చిట్యాల భారతీయ జనతా పార్టీ నాయకుడు పల్లపు బుద్ధుడు ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశo సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ప్రజా దీవెన, చిట్యాల: చిట్యాల భారతీయ జనతా పార్టీ(BJP) నాయకుడు పల్లపు బుద్ధుడు ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్(Congress) పార్టీలో చేరారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశo(Vemula Veeresham) సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.నకిరేకల్ నియో జకవర్గ శాసన సభ్యులు వేముల వీరేశo సమక్షంలో రాష్ట్ర నాయకులు గుత్తా అమిత్ రెడ్డి, మదర్ డైరీ మాజీ చైర్మన్ గుత్తా జితేందర్ రెడ్డి ల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
తెలంగాణ ఉద్యమకారులు సీనియర్ నాయ కులు పల్లపు బుద్ధుడు, ఉరుమడ్ల మాజీ ఎంపీటీసీ పోలగోని స్వామి, జన్నపాల శ్రీను,నడిoపల్లి గోపాల్, రూపని యాదయ్య , పాకాల దినేష్ మరియు తదితరులు చేరారు. ఈ కార్యక్రమంలో చిట్యాల మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకట్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు గుడిపాటి లక్ష్మి నరసింహ, కాంగ్రెస్ జిల్లా నాయకులు కొనేటి యాదగిరి, గ్రామ శాఖ అధ్యక్షుడు చెరుకు సైదులు, సోషల్ మీడియా ఇంచార్జీ పట్ల జనార్ధన్, బొడ్డు శ్రీను, కురుపటి లింగయ్య, గుత్తా రవిoధర్ రెడ్డి, మేడబొయున శ్రీనివాస్, గంగాపురo వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
BJP leader join congress