Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

BJP: దిష్టిబొమ్మ దగ్ధం చేస్తున్న క్రమంలో అడ్డుకున్న పోలీసులు

*బిజెపి నాయకుల అరెస్టు*
BJP: ప్రజా దీవెన, నల్గొండ రూరల్: బిజెపి నల్లగొండ మండల శాఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్న క్రమంలో పోలీసులు అడ్డుకోని పలువురు బిజెపి నాయకులను అరెస్టు చేసి నల్గొండ రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.. మొన్న భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం పై కాంగ్రెస్ పార్టీ ముకలు కోడిగుడ్లు టమాటాలు, కర్రలు రాళ్లతో దాడి చేసి అక్కడున్నటువంటి బిజెపి నాయకులను కార్యకర్తలని పై భౌతికంగా దాడి చేసి గాయపరచడాన్ని నిరసిస్తూ,

ఈరోజు నల్లగొండ మండల శాఖ ఆధ్వర్యంలో మండల పరిధిలోని కొత్తపెల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ హైదరాబాదులోని బిజెపి రాష్ట్ర కార్యాలయం పై కాంగ్రెస్ పార్టీ ముకలు దాడి చేయడంతో పాటు పలువురు బిజెపి శ్రేణులపై భౌతికంగా దాడి చేయడానికి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని ఆ దాడి చేసిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు బొగరి అనిల్ కుమార్, బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పాలకూరి రవి గౌడ్, మండల సీనియర్ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బాకి నరసింహ,మండల ఉపాధ్యక్షులు బుచ్చాల నాగరాజు గౌడ్,రేగట్ట రుక్నాగౌడ్, కొత్తపల్లి వెంకట్, కొత్తపల్లి ప్రమోద్ దళిత మోర్చా మండల అధ్యక్షుడు పోతేపాక శంకర్,సూరికంటి వెంకట్ రెడ్డి, ఆవుల బుచ్చయ్య యాదవ్, దుబ్బాక లక్ష్మణ్ యాదవ్, కొత్తపల్లి బూత్ అధ్యక్షులు, నక్క పరమేష్, సింగం నరేందర్, జిల్లపల్లి రాజశేఖర్, జట్టి జానకి రాములు, మటోజు సుదర్శన చారి,ఉప్పునూతల యాదగిరి, నక్క యాదయ్య తదితరులు పాల్గొన్నారు..