మహిళా సమ్మేళనం విజయవంతం చేయాలి
బీజేపీ జిల్లా కార్యాలయంలో ఈ నెల 20న నిర్వహించే మహిళా సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి అన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి
వివిధ పార్టీల నాయకులు బీజేపీలో చేరిక
ప్రజాదీవెన, నల్లగొండ: బీజేపీ జిల్లా కార్యాలయంలో ఈ నెల 20న నిర్వహించే మహిళా సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని బీజేపీ (bjp) జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి అన్నారు. నల్లగొండ పట్టణం మర్రిగూడకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, తిప్పర్తి మండలం ఇడ్లూరు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు బారిగా బీజేపీలో చేరారు.
ఈ సందర్భంగా డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ 22న ఏప్రిల్ నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి భారీ ర్యాలీతో నామినేషన్ వేయడం జరుగుతుందని చెప్పారు. ముఖ్యఅతిథిగా కేంద్ర మంత్రి పియూష్ గోయల్, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ముఖ్యఅతిథిగా వస్తున్నట్లు చెప్పారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయగలరని పిలుపునిచ్చారు. తదనంతరం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కన్మంత రెడ్డి శ్రీదేవి రెడ్డి మాట్లాడుతూ మహిళా సమ్మేళనం బిజెపి జిల్లా కార్యాలయంలో నిర్వహించబడుతుందని, పెద్ద ఎత్తున మహిళలు(Women) పాల్గొని మహిళా సమ్మేళనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
నల్లగొండ పార్లమెంట్ (Nalgonda parliament) కో కన్వీనర్ పిల్లి రామరాజు యాదవ్ ఆధ్వర్యంలో నల్గొండ పార్లమెంట్ ప్రభారీ చాడ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి సమక్షంలో కార్యకర్తలు, నాయకులు ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. అనంతరం పిల్లి రామరాజు యాదవ్ మాట్లాడుతూ దేశ బాగుండాలంటే మూడవసారి నరేంద్ర మోడీ అధికారంలోకి రావాలని దేశ వ్యాప్తంగా చూస్తున్నారని, కేంద్రంలో 400 సీట్లు రావడం ఖాయమని, ఇందులో నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి శానాంపూడి సైది రెడ్డి కూడా ఉంటారని అన్నారు.
కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కన్మంత రెడ్డి శ్రీదేవి రెడ్డి, పార్లమెంటు కన్వీనర్ బండారు ప్రసాద్, జిల్లా మీడియా కన్వీనర్ గడ్డం మహేష్ జిల్లా అధికార ప్రతినిధి బీపాంగి జగ్జీవన్, పెరిక ముని కుమార్, అసెంబ్లీ కన్వీనర్ దాయం భూపాల్ రెడ్డి, తిప్పర్తి మండల అధ్యక్షుడు పల్లె ప్రకాష్ మాజీ మండల అధ్యక్షుడు గుండా వినయ్ మండల ప్రధాన కార్యదర్శి గంటగంపు మధు, బీపంగి చంటి వినయ్ అనుముల దేవి,యువ మోర్చ జిల్లా కార్యదర్శి శాంతి స్వరూప్, కార్యకర్తలు పాల్గొన్నారు.
BJP women meeting in Nalgonda