BJP: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్గొండ బిజెపి జిల్లా కార్యాలయం (BJP District Office) లో 78వ స్వాతంత్ర దినోత్సవ సం దర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షులు డా,నాగం వర్షిత్ రెడ్డి జాతీయ జెం డాను ఆవిష్కరించారు. జాతీయ నేతల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి మిఠాయిలు పంపిణీ చేశారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను (Independence Day celebrations) పార్టీ శ్రేణులతో ఘనంగా నిర్వ హించుకున్నారు.ఈ సందర్భంగా నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య సమరయోధు లు ,దేశ స్వాతంత్ర్యంలో ముఖ్యమై న పాత్రను పోషించడమే కాకుండా, వారు ధైర్యమైన, అచంచలమైన సంకల్పం, దేశం పట్ల స్థిరమైన భక్తి ని కూడా కలిగిన వారి పోరాట ఫలి తమే మన దేశానికి స్వాతంత్ర్యం లభించింది అని స్వాతంత్ర సమర యోధులను, కుటుంబాలను నాగం వర్షిత్ రెడ్డి కొనియాడారు. కేంద్రంలో బీజేపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే భారతదేశానికి నిజమైన స్వాతంత్ర్యం లభించింది అని అన్నారు. బగుడు ,బలహీన వర్గాలకు గత పది సంవత్సరాలుగా పెద్ద పీట వేసిన ఘనత నరేంద్ర మోడీదని వర్శిత్ రెడ్డి అన్నారు.
గత సంవత్సరం సెప్టెంబర్ 17న విశ్వకర్మ యోజన పథకం (Vishwakarma Yojana Scheme) ప్రవే శపెట్టిన నరేంద్ర మోడీ 18 రకాల చేతి వృత్తిదారులకు జీవనోపాధి కల్పించే విధంగా వారి యొక్క జీవితాలు మెరుగుపడడానికి విశ్వకర్మ యోజన పథకం (Vishwakarma Yojana Scheme) తో లక్ష రూపాయల నుండి మూడు లక్షల వరకు రుణ సదుపాయం కల్పిం చడానికి కేంద్ర బడ్జెట్లో ,ఈ యొక్క పథకానికి రూ. 33 వేల కోట్లు రూ పాయలను మొదటిసారిగా కేటా యించిన ప్రధాని నరేంద్ర మోధీ (Narendra Modi) ప్రభుత్వం అని అన్నారు. అదే విధంగా రైతులు ఎలాంటి ఇబ్బం దులు పడకుండా వ్యవసాయం చేసుకోవడానికి సబ్సిడీతో కూడిన ఫర్టిలైజర్స్, యూరియా ,డిఏపి ఎరువులతో మరియు రసాయనిక ఎరువులను అతి తక్కువ ధరలకు రైతులకు అందించి రైతుల కష్టాలు తీర్చుతున్నాం ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం అని అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా రైతుల యొక్క ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమయ్యాయి మరి మోదీ ప్రభుత్వం రైతు పం డించిన ప్రతి గింజకు మద్దతు ధర కల్పించి రైతులు పండించినటు వంటి ధాన్యాన్ని దళారుల పాలు కాకుండా నేరుగా ప్రభుత్వం కొనే విధంగా కృషి చేయడం జరిగిందని తెలిపారు.