Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Boda Swami: కాంగ్రెస్ ఎస్సీ సెల్ పటిష్టత కోసం కృషి చేస్తా

–కాంగ్రెస్ ఎస్సీ సెల్ నూతన అధ్య క్షుడు బోడ స్వామి

Boda Swami: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: కాంగ్రెస్ ఎస్సీ సెల్ (Congress SC Cell)పటిష్టత కోసం చిత్తశుద్ధితో పనిచేస్తానని కాంగ్రెస్ ఎస్సీ సెల్ నూతన అధ్యక్షుడు బోడ స్వామి (Boda Swami) అన్నారు. నూతన ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా ఎన్నికైన బోడ స్వామిని ఆదివారం నల్గొండ పట్టణంలోని జడ్పీ అతిథిగృహ ఆవరణలో పలువురు కాంగ్రెస్ ఎస్సీ సెల్ నాయకులు సన్మానించారు. ఈ సందర్భంగా స్వామి (Boda Swami)మాట్లాడుతూ కాంగ్రెస్ ఎస్సీ సెల్ పాత కమిటీలన్నింటిని రద్దు చేయడం జరిగిందని, త్వరలోనే పూర్తిస్థాయి జిల్లా కమిటీని, మండల కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.

తనకిచ్చిన ఎస్సీ సెల్ జిల్లా (Congress SC Cell) చైర్మన్ పదవికి పూర్తిగా న్యాయం చేస్తానని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజల సంక్షేమమే (Welfare of poor people) ధ్యేయంగా పనిచేస్తూ ముందుకు పోతుందని అన్నారు.ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టే అన్ని కార్యక్రమాలలో ఎస్సీ సెల్ క్రియాశీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఎస్సీ సెల్ పటిష్టత కోసం పనిచేస్తూ ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అర్హులైన వారికి అందే విధంగా కృషి చేస్తుందని అన్నారు.

కాంగ్రెస్ ఎస్సీ సెల్ నూతన కమిటీలను త్వరలోనే వేయడం జరుగుతుందని తెలిపారు. ఎస్సీ సెల్ (Congress SC Cell)చైర్మన్ గా తన నియామకానికి సహకరించిన మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర చైర్మన్ నగరి గారి ప్రీతం, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంతో పాటు ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, కుందూరు రఘువీర్ రెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలకు, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులకు, పార్టీ శ్రేణులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెరిక హరిప్రసాద్, బోడ ప్రభాకర్, పెరిక అంజ య్య, ఇరుగు మధు, కురుపాటి గణేష్, పెరిక మహేష్, మేడి శ్రీను, కుడుతాల నాగరాజు, చిరుమర్తి శ్రీను, పల్లా రవితేజ తదితరులు పాల్గొన్నారు.