నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ బొడ్డుపల్లి లక్ష్మి
Boddupalli Lakshmi: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: మ హిళలు, గర్భిణీలు, పిల్లలు ప్రతి ఒక్కరు పోషకాహారం తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్, 40 కౌన్సిలర్ బొడ్డుపల్లి లక్ష్మి (Boddupalli Lakshmi)అన్నారు. బుధవారం నల్గొండ పట్టణంలోని 40 వ వార్డు దయానందనగర్ అంగన్వాడి సెంటర్(Anganwadi Centre) లో నిర్వ హించిన పోషకాహార వారో త్సవాలకు ఆమె హాజరై మాట్లా డారు. ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం (Nutritious food) తప్పనిసరి అని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు మంచి ఆహారాన్ని తీసుకోవాల న్నారు. మంచి ఆహారం తీసుకో వడం ద్వారా రోగాల బారిన పడ కుండా ఉండే అవకాశం ఉంద న్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాలను మహిళలు గర్భిణులు (Women are pregnant) ప్రతి ఒక్కరు వినియో గించుకోవాలన్నారు. అనంతరం అంగన్వాడి సెంటర్ లో మొక్కలు నాటారు. కార్యక్రమంలో పానగల్ అర్బన్ హెల్త్ సెంటర్ ఏఎన్ఎం ఎన్. శిరీష, అంగన్వాడి టీచర్లు యాదమ్మ, సరోజిని, వినోద, ఆయాలు, గర్భిణీలు, మహిళలు పాల్గొన్నారు.