Bogari Ramakrishna: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ జిల్లా సెక్రెటరీగా బోగారి రామకృష్ణను (Bogari Ramakrishna) సోమవారం ఏకగ్రీ వంగా ఎన్నుకున్నారు. కాంగ్రెస్ ఎస్సీ డిపార్ట్మెంట్ నల్లగొండ జిల్లా చైర్మన్ బోడ స్వామి తన కార్యా లయంలో నిర్వహించిన సమావే శంలో ఎన్నుకొని రామకృష్ణకు నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా రామకృష్ణ (Bogari Ramakrishna) మాట్లాడుతూ తన నియమకానికి సహ కరించిన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంక టరెడ్డి,(Komati Reddy Venka Tareddy) నల్లగొండ ఎంపీ రఘువీర్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, డిసిసి ప్రెసిడెంట్ శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, గుమ్మల మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బాగోని రమేష్ గౌడ్, జిల్లా చైర్మన్ బోడ స్వామి మాజీ జడ్పిటిసి వంగూరి లక్ష్మ య్య, ఎస్సీ డిపార్ట్మెంట్ అధికార ప్రతినిధి పెరిక అంజయ్య, ఎస్సీ డిపార్ట్మెంట్ ఉపాధ్యక్షులు పెరిక హరిప్రసాద్ లకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు అర్హులైన (Eligible for welfare scheme) వారికి అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.జిల్లాలో ప్రతినిత్యం కాంగ్రెస్ పార్టీ కోసం అడుగులు వేస్తూ పార్టీని బలోపేతం చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్ర మంలో కుడుతాల నాగరాజు, శ్రీనివాస,బాకీ శివ, యేసు,రం జిత్ ,నవీన్,వంశీ యాదగిరి భరత్ అజయ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.