Bommagani Raju: ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : సమగ్ర శిక్షా ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండ కలక్టరేట్ ముందు 25వ రోజు నిరవధిక సమ్మె కొనసాగింది. ఆధునిక భారత దేశ తొలి ఉపాధ్యాయలరాలు సావిత్రి భాయి ఫూలే జన్మదినం సందర్భంగా తన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు మొలిగురి కృష్ణ బొమ్మగాని రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా దినోత్సవం సందర్భంగా మా ఉపాధ్యాయుల సేవలను గుర్తించి తక్షణమే డిమాండ్ లను పరిష్కరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు కంచర్ల మహేందర్, క్రాంతి కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ కొండ చంద్రశేఖర్, ఎమ్ నీలాంబరి, మహిళా అధ్యక్షురాలు గుమ్మల మంజులారెడ్డి, మహిళా కార్యదర్శి సావిత్రి, అసోసియేట్ ప్రెసిడెంట్ వి. సావిత్రి , కోశాధికారి పుష్పలత, ఇటికాల రమేష్, సాయిలు , ఉపాధ్యక్షులు వెంకట్, జి వెంకటేశ్వర్లు,ఎర్రమల్ల నాగయ్య, ప్రచార కార్యదర్శి చందపాక నాగరాజు,బంటు రవి, లలిత, కొండయ్య, యాదయ్య, యాట వెంకట్, జి వెంకటేశ్వర్లు,ధార వెంకన్న, శ్రీనివాస్, వి రమేష్, వసంత, సుజాత, నిరంజన్, వెంకటకృష్ణ, నాగయ్య, భిక్షం, బిక్షమా చారి, మొయిజ్ ఖాన్, పరమేశ్,నాగభూషణం చారి, రహీం, పాండు నాయక్, జానయ్యా, చంద్రమౌళి,యాదయ్య తదితరులు పాల్గొన్నారు.