BRS:ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (ktr) పిలుపుమేరకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహా నికి బదులుగా రాజీవ్ గాంధీ విగ్ర హాన్ని ప్రతిష్టించినందుకు నిరస నగా నల్లగొండ నాగార్జున కళాశాల వద్దగల తెలంగాణ తల్లి విగ్రహానికి (Telangana mother idol)నల్లగొండ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు పాలాభిషేకం నిర్వహించా రు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు తెలంగాణ తల్లి విగ్రహం (Telangana mother idol)ఒక స్ఫూర్తిదాయక మని, అహిం సాయుతంగా జరిగి న తెలంగాణ ఉద్యమానికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ తల్లి విగ్రహం ఒక అపురూప చి హ్నం మని అలాంటి విగ్రహాన్ని కెసిఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బిఆర్ అంబేద్కర్ సచివాలయ (BR Ambedkar Secretariat)ఎదురుగా ప్రతిష్టిం చాలి అనుకున్నారని కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన ప్రస్తుత ముఖ్యమంత్రి, తెలంగాణ తల్లి విగ్రహం విలువ ప్రతిష్టను మసకబార్చారని తాము తిరిగి అధికారంలోకి రాగానే ఆ స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టి స్తామని తెలియజేశారు.పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, మాజీ ఆర్వో మాలే శరణ్య రెడ్డి,కోఆప్షన్ సభ్యులు కొండూరు సత్యనారాయణ, జమాల్ ఖాద్రి,గుండ్రెడ్డి యుగంధర్ రెడ్డి,… నాయకులు..గంజి రాజేందర్, పొనుగోటి జనార్దన్ రావు , షబ్బీర్, రావు,వీరమల్ల భాస్కర్.. వెంకట్ రెడ్డి,విద్యార్థి విభాగం నాయకులు, నాగార్జున, అంబటి ప్రణీత్, మాజీ సర్పంచ్ నారగోని నరసింహ, జగన్,నవీన్, గణేష్,పి సైదులు, బొజ్జ సైదు లు, తదితరులు పాల్గొన్నారు.