Last rites: బిఆర్ఎస్ నేతకు అంతిమ సంస్కారం
బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకు లు సందినేని జనార్దన్ రావు మృత దేహానికి సందర్శించి బి ఆర్ ఎస్ నేతలు, నాయకులు, కార్యకర్తలు ఘన నివాళి అర్పించారు.
ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకు లు సందినేని జనార్దన్ రావు(Janardhan rao) మృత దేహానికి సందర్శించి బి ఆర్ ఎస్ నేతలు, నాయకులు, కార్యకర్తలు ఘన నివాళి అర్పించారు. జనార్దన్ రావు నివాసంలో ఆయన మృత దేహానికి పూలమాల వేసి నివాళి అర్పించి కుటుంబ సభ్యులను ఓదా ర్చారు. తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ మంత్రి,సూర్యాపేట శాసన సభ్యులు గుంతకండ్ల జగదీష్ రెడ్డి, నల్లగొండ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, నల్గొండ పార్లమెంట్ అభ్యర్ధి కంచర్ల కృష్ణా రెడ్డి, మాజీ మున్సి పల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి,పార్టీ సీనియర్ నాయకులు కటికం సత్తయ్య గౌడ్, జడ్పిటిసీ చిట్ల వెంకటేశం , బిఆర్ యస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటేశ్వర రావు ,గోపాల్ రెడ్డి , కొండూరు సత్యనారాయణ , హరికృష్ణ, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
BRS leader janardhan rao Last rites