BRS party: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: రాష్ట్ర శాసనసభలో బిఆర్ఎస్ పార్టీ మహిళా శాసనసభ్యులపై ముఖ్య మం త్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) మంత్రు లు చేసిన అనుచిత వ్యాఖ్యల కు నిరసనగా పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటిఆర్ పిలుపు మేరకు గురువారం నల్లగొం డ జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ నాయ కులు (Leaders of BRS)సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. నాగార్జున కళాశాల వద్ద గల తెలంగాణ తల్లి విగ్రహం ముందు నల్లగొండ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పెద్దఎ త్తున నిరసన కార్యక్రమం చెపట్టా రు. ముఖ్యమంత్రి, మంత్రులు తెలుగు మహిళల కు క్షమాపణలు చెప్పాలని, మహిళలను కించపరి చేవిదంగా ఉన్న వారి వ్యాఖ్యలు ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు.
పెద్ద ఎత్తున నినాదాలు చేస్తు నల్ల బ్యానర్ తో (banners)నిరసన వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలోరాష్ట్ర పార్టీ కార్యదర్శి నిరంజన్ వలి, మాజీ ఆర్వో మాలే శరణ్య రెడ్డి,కనగల్ మాజీ ఎంపీపీ కరీం పాషా, సింగం రామ్మోహన్, కంచనపల్లి రవీందర్రావు,పట్టణ పార్టీ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, నల్గొండ,కనగల్ మండల పార్టీ అధ్యక్షులు దేప వెంకట్ రెడ్డి అయి త గోని యాదయ్య, కౌన్సిలర్ మార గొని గణేష్, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు కొండూరు సత్యనారాయ ణ జమాల్ ఖాద్రి, గుండ్రెడ్డి యుగం ధర్ రెడ్డి, రంజిత్, జిల్లా రైతుబంధు కమిటీ మాజీ సభ్యులు వనపర్తి జ్యోతి నల్గొండ మహిళా అధ్యక్షు రాలు కొప్పోలు విమలమ్మ,మెరు గు గోపి,బడుపుల శంకర్, కడారి కృష్ణయ్య,గంజి రాజేంద ర్,విద్యార్థి విభాగం నాయకుడు బొమ్మరబోయిన నాగార్జున ,వీరమల్ల భాస్కర్, షబ్బీర్, సుంకి రెడ్డి వెంకట్ రెడ్డి, కంకణాల వెంకట్ రెడ్డి, వివేక్ రెడ్డి, బొజ్జ వెంకన్న, వజ్జ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి, రుద్రాక్ష వెంకన్న,పుట్ట కోటయ్య, బొజ్జశ్రీను శ్రీను మున్నా,ముద్సర్, బషీర్,తదితరులు పాల్గొన్నారు