Congress: కాంగ్రెస్ పార్టీలోకి కొనసాగుతున్న వలసలు
కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. గత వారం రోజులుగా నల్గొండ పట్టణంలోని వివిధ వార్డుల్లో బీఆర్ఎస్,బిజెపి పార్టీలకు చెందిన కార్యకర్తలు ఆయా పార్టీలను వీడి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు.
ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: కాంగ్రెస్ పార్టీలోకి(congress party) వలసలు కొనసాగుతున్నాయి. గత వారం రోజులుగా నల్గొండ పట్టణంలోని వివిధ వార్డుల్లో బీఆర్ఎస్,బిజెపి పార్టీలకు చెందిన కార్యకర్తలు ఆయా పార్టీలను వీడి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. మంగళవారం నల్లగొండ పట్టణంలోని 8వ వార్డుకు చెందిన 100 మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(komati reddy venkat reddy) క్యాంపు కార్యాలయం లో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
నూతనంగా పార్టీలో చేరిన దేవరకొండ యాదయ్య, సైదులు వల్కి వెంకన్నతో పాటు పలువురికి హస్తం కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇంచార్జ్ వజ్జ రమేష్, 9వ వార్డు అధ్యక్షుడు పిల్లి రమేష్ యాదవ్, జావిద్ తదితరులు పాల్గొన్నారు.
కొత్తపల్లి గ్రామం నుంచి….
నల్లగొండ మండలం కొత్తపల్లి గ్రామం నుంచి 120 మంది బీఆర్ఎస్(BRS Party) పార్టీ కార్యకర్తలు ఈరోజు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంగళవారం గ్రామంలో పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వజ్జ సత్యనారాయణ, గ్రామ శాఖ అధ్యక్షుడు పాలడుగు అజయ్,పగిడి విగ్నేశ్వర్, జిల్లపల్లి నాగరాజు, బోధనకు రామిరెడ్డి,కొప్పుల వెంకటరెడ్డి, ఏదుళ్ల భగవంతు రెడ్డి,రామచంద్రు, రమేష్, వెంకన్న, వేణు, యాదయ్య,నగేష్ తదితరులు పాల్గొన్నారు.
BRS workers joined congress party