దోపిడి రహిత సమాజ నిర్మాణమే సిపిఎం లక్ష్యం
–ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి
ప్రజాదీవెన నల్గొండ:
CPM: దోపిడీ రహిత సమాజ నిర్మాణమే సిపిఎం లక్ష్యమని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం నల్గొండ పట్టణంలోని పెద్ద బండ ఎఫ్సీఐ ఫంక్షన్ హాల్ లో రెండు రోజులపాటు జరుగుతున్న సీపీఎం నల్లగొండ నియోజకవర్గస్థాయి రాజకీయ శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ..
ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారీ సమాజం దోపిడీ కొనసాగిస్తూ పేదలను మరింత పేదలుగా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ సమాన అవకాశాలు అందాలని సిపిఎం పోరాడుతుందని అన్నారు. కేంద్రంలో బిజెపి కార్పొరేట్లకు అనుకూలంగా కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దుచేసి కార్మికులను కట్టు బానిసలుగా చేస్తుందని ఆరోపించారు రైతాంగానికి కనీస మద్దతు ధర చట్టం చేస్తామని హామీ ఇచ్చి అమలు చేయడం లేదని విమర్శించారు.
ప్రభుత్వ రంగ సంస్థలను కార్పోరేట్ సంస్థలకు అమ్ముతూ సార్వభౌమత్వాన్ని పేదలకు కూలి, భూమి అందే వరకు, దోపిడీ అంతం అయ్యేవరకు ఎర్రజెండా ప్రజల్లో గుండెల్లో ఉంటుందని అన్నారు. ఆదివారం ఉదయం కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్, మధ్యాహ్నం మతం మతోన్మాదం ప్రతిఘటన ఉద్యమాలు అనే అంశంపై పిట్టల రవి బోధించారు.
ఈ శిక్షణా తరగతులకు ప్రిన్సిపల్ గా సిపిఎం పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య వ్యవహరించగా, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సయ్యద్ హాశం, పాలడుగు నాగార్జున, పాలడుగు ప్రభావతి, జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం, కొండ అనురాధ, నలగొండ తిప్పర్తి కనగల్లు మాడుగులపల్లి మండల కార్యదర్శిలు నలపరాజు సైదులు, మన్నెం బిక్షం, కానుగు లింగస్వామి పుల్లెంల శ్రీకర్ తదితరులు పాల్గొన్నారు.