Burri Srini Vasa Reddy : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: సెంటినరీ తెలుగు సెల్ఫ్ సపోర్టింగ్ బాప్టిస్ట్ చర్చ్, వై ఎం సి ఏ నూతన సంవత్సర క్యాలెండర్ ను మంత్రి క్యాంప్ కార్యాలయంలో మంగళ వారం మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీని వాస రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన సంవ త్సరాన్ని ప్రణాళిక బద్ధంగా కార్య క్రమాలు నిర్వహిస్తూ, ప్రజలకు సేవ లు చేయాలని, తమ ప్రభుత్వం ఎల్లప్పుడు సేవా కార్యక్రమాలకు, అభివృద్ధి పనులకు సహకరిస్తుంద ని అన్నారు.
ఈ కార్యక్రమంలో చర్చి సంఘ అధ్యక్షుడు టిఎస్ క్రిస్ట ఫర్, ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ పొలిటికల్ సెక్రటరీ పసల శౌరయ్య, వైఎంసిఏ రాష్ట్ర అధ్య క్షుడు టీఎస్ విలియమ్స్, పి యే లీషా, ఆశయ్య, రెవరెండ్ పాస్టర్ ప్రవీణ్ కుమార్, అనంద్ ప్రసా ద్,నతనీయెల్ తదితరులు పాల్గొన్నారు.