–నల్లగొండ నగరానికి స్వచ్ఛ్ వా యు సర్వేక్షణ్ 2024లో రాణిoపు
–మూడు లక్షల జనాభా పట్టణాల జాబితాలో రెండవ స్థానం
–నల్లగొండ మునిసిపాలిటీకి రూ. 25 లక్షల నగదు పురస్కారం
–రాజస్థాన్ లో జరిగిన స్వచ్ఛ్ వా యు దివస్ కార్యక్రమంలో పాల్గొన్న చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి
Burri Srinivas Reddy: ప్రజా దీవెన, రాజస్థాన్ :నల్లగొండ మున్సిపాలిటీకి అరుదైన ఘనత దక్కింది. నల్లగొండ నగరానికి స్వ చ్ఛ్ వాయు సర్వేక్షణ్ 2024లో అనుకున్న విధంగానే రాణించింది. మూడు లక్షల జనాభా పట్టణాల జాబితాలో రెండవ స్థానం సాధిం చడం ద్వారా ఆ ఘనత దక్కిం చుకుంది. ఆ మేరకు నల్లగొండ మున్సిపాలిటీకి రూ. 25 లక్షల నగదు పురస్కారం దక్కగా రాజ స్థాన్ లో శనివారం జరిగిన స్వచ్ఛ్ వాయు దివస్ కార్యక్రమంలో పాల్గొ న్న చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి (Burri Srinivas Reddy) కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డు అందు కున్నారు. పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేష నల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ (NCAP) కింద నిర్వహించిన స్వచ్ఛ్ వాయు సర్వేక్షణ్ 2024లో నల్గొండ నగరం జనాభా కేటగిరీ-3 3 లక్షలలో రెండ వ స్థానం సాధించింది.
స్వచ్ఛ్ వా యు సర్వేక్షణ్ (Swachh Va U Sarvakhsh)2024లో భాగంగా, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) నిర్వహించిన మూల్యాం కన ప్రక్రియలో, 131 నగరాలు స్వీయ-అంచనా నివేదికలు సమ ర్పించగా నల్గొండ నగరం అత్యు త్తమ పనితీరు కనబరచింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని శనివారం జైపూర్ ఎగ్జిబిషన్ మరి యు కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన స్వచ్ఛ్ వాయు దివస్ కార్యక్రమం లో నల్గొండ మునిసిపాలిటీకి రూ. 25 లక్షల నగదు పురస్కారం ప్రదా నం చేయబడింది.ఈ కార్యక్ర మంలో మునిసిపల్ చైర్ పర్సన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మునిసిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అ హ్మద్ పాల్గొన్నారు. నల్గొండ నగరా నికి లభించిన ఈ ఘనతను స్వీక రించారు. గౌరవనీయ పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రి భూపేందర్ యా దవ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి భజ న్ లాల్ శర్మ చేతుల మీదుగా ఈ నగదు పురస్కారం అందుకున్నారు.