Burri Srinivas Reddy :ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: పేద వర్గాలు, కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డిలు అన్నారు, బుధవారం నల్గొండ పట్టణంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ తో కలిసి నల్లగొండ పట్టణ భవన నిర్మాణ కార్మిక సంఘం (INTUC)-2025 నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సంఘానికి, కార్మికులకు ఎల్లవేళలా అండగా ఉంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐఎన్ టియుసి జిల్లా మాజీ కార్యదర్శి, ముఖ్య సలహాదారు ఎండి మహమూద్, పట్టణ అధ్యక్షుడు సోలిపురం శంభు రెడ్డి, ఉపాధ్యక్షుడు పోతపాక సహదేవ, కోశాధికారి ఎస్కె గౌస్, ప్రధాన కార్యదర్శి బొజ్జ నాగరాజు, కార్యదర్శి పెరిక నరసింహా, సహాయ కార్యదర్శి కొమ్మనబోయిన మల్లయ్యతో పాటు సలహాదారులు, సభ్యులు డి.యాదయ్య, గాదపాక వీరయ్య, జీడిమడ్ల యాదయ్య, కొండా రాములు, సిహెచ్ మహేష్, ఆర్.కిరణ్ కుమార్, వజ్జ నరసింహ, పోతేపాక యాదయ్య, బోడ సోములు తదితరులు పాల్గొన్నారు.