Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Burri srinivas reddy: రాజకీయాలకతీతంగా పట్టణాభివృద్ధి

–విలీన గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిoపు
–మర్రిగూడలో రూ.54 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాప న
–నల్లగొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి

Burri srinivas reddy: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్ల గొండ మున్సిపాలిటీని రాజకీ యాలకు అతీతంగా అన్ని విధాలు గా అభివృద్ధి చేయడం జరుగు తుందని మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి ( Burri srinivas reddy ) అన్నారు. సోమవారం నల్లగొండ మున్సిపాలిటీలోని 14వ వార్డు మర్రిగూడలో తెలంగాణ అర్బ న్ ఫైనాన్స్ ఇన్ ప్రాస్ట్రాక్టర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (TFIC) కింద రూ.54 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు మున్సి పల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్య క్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, స్థానిక వార్డు కౌన్సిలర్ బొజ్జ శంకర్ తో కలిసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (KotamReddy Venkata Reddy) సహకారంతో వచ్చే రెం డేళ్లలోపు నల్గొండను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరుగు తుందని స్పష్టం చేశారు.అన్ని వార్డు లలో సిసి రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులను, మంచినీటి సమస్యను పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. గతంలో నల్గొండ పట్టణంలో కొన్ని మెయిన్ రోడ్లు వేశారే తప్ప ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదన్నారు. పట్టణంలో అన్ని వార్డుల అభివృద్ధితో పాటు వీలీన గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. ఔటర్ రింగ్ రోడ్ పై కొందరు అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి కోరడంతో కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. దీనిపై కొందరు అనవసరంగా రాజకీయం చేస్తున్నారని అన్నారు.

ఔటర్ రింగ్ రోడ్డు నిర్మా ణం వలన నష్టపోయే వారికి సరైన పరిహారం చెల్లించడం జరుగుతుందని ఇప్పటికే మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేయడం జరిగిందని పేర్కొన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బుకొని రమేష్ గౌడ్ (ramesh Goud) మాట్లాడుతూ మర్రిగూడ నుంచే అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు. నల్లగొండ మున్సిపాలిటీలోని అన్ని వార్డను అభివృద్ధి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. తనకు పదవి ఉన్నా లేకపోయినా మంత్రి సహకారంతో పట్టణ అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తానని అన్నారు. మర్రిగూడలోని సిసి రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులతో పాటు పైప్ లైన్ వేయించి వాటర్ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని పేర్కొన్నారు.

రూ.54 కోట్లతో సిసి రోడ్లు, డ్రైనేజీ పనులను పూర్తి చేయించడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసబ్ అహ్మద్, నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, మాజీ జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, స్థానిక కౌన్సిలర్ బోజ్జ శంకర్, కౌన్సిలర్లు జేరిపోతుల అశ్విని భాస్కర్ గౌడ్, పబ్బు సాయి, కాంగ్రెస్ నాయకులు, మర్రిగూడ వాసులు గుమ్ముల నాగిరెడ్డి, మాలే చంద్రారెడ్డి, బుర్ర యాదయ్య యాదవ్, తుమ్మల మధుసూదన్ రెడ్డి, జేరిపోతుల లింగయ్య, గురిజ వెంకన్న గౌడ్, మర్రి శివయాదవ్, నిదానంపల్లి సాయి, సుంకరబో యిన విన్ని యాదవ్, కొప్పోలు వెంకన్న, సుంకరబోయిన మధు, బొజ్జ రాము, బీపంగి సైదులు, మర్రి సత్తయ్య యాదవ్, మచ్చ శీను, బొజ్జ కృష్ణ, బొజ్జ రవి తదితరులు పాల్గొన్నారు.