–రూ.25000 ప్రకటించిన బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పాండురంగారెడ్డి
Busireddy Foundation:ప్రజా దీవెన, నాగార్జునసాగర్: నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం తిరుమలగిరి సాగర్ మండలం నాయకుని తండా గ్రామoలోని చర్చికి బుచ్చిరెడ్డి ఫౌండేషన్(Busireddy Foundation) విరాళం ప్రకటించింది. గ్రామ మాజీ సర్పంచ్ మేరావత్ మునినాయక్ (Meravath Muninayak)ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా హాజరై ఆ ఊరి గ్రామస్తులతో చర్చించి బుసిరెడ్డి ఫౌండేషన్ చేస్తున్న సేవలు గురించి తెలియజేశారు. గ్రామస్తులతో చర్చ ల్లో బాగంగా రూ.25 వేలు విరాళం ప్రకటించారు బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి.
ఈ కార్యక్రమంలో భాగంగా బుసి రెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డిని (Busireddy Panduranga Reddy is the Chairman of Busi Reddy Foundation) శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ కార్య క్రమంలో తిరుమలగిరి సాగర్ మండలం మాజీ వైస్ యంపిపి యడవల్లి దిలీప్ రెడ్డి, నాయకుని తండా మాజీ సర్పంచ్ మేరావత్ ముని నాయక్,నెల్లికల్లు మాజీ సర్పంచ్ పమ్మి జనార్ధన్ రెడ్డి, పెద్దవూర మాజీ సర్పంచ్ నడ్డి లింగయ్య యాదవ్, మాజీ యంపి పి, తిరుమలనాధ గుడి చైర్మన్ బుర్రి రామిరెడ్డి,ఫాస్టర్, ఇస్రం లింగస్వా మి, గజ్జల శివానంద రెడ్డి, నితిన్, కొండలు,బిచ్యాలు నాయక్, మోతి నాయక్, నాగేందర్ నాయక్, శ్రీను నాయక్, శంకర్ నాయక్, హనుమా తదితరులు పాల్గొన్నారు.