Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

C. H. Lakshminarayana: వివోఏలను సేర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలి

–సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహె చ్ లక్ష్మీనారాయణ

C. H. Lakshminarayana: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: తెలంగాణ రాష్ట్రంలో వివోఏలుగా పనిచేస్తున్న అందరిని సెర్ప్ ఉద్యో గులుగా గుర్తించాలని అప్పటివరకు 26 వేల కనీస వేతనం అమలు చేయా లని తెలంగాణ ఐకెపి వివో ఏల ఉద్యోగుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు సిఐటియు జిల్లా అధ్య క్షులు సిహెచ్ లక్ష్మీనారాయణ (C. H. Lakshminarayana) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు డిఆర్డిఏ పిడి కార్యాలయం ముందు ధర్నా చేశారు.* అనంతరం ఏపీడికి వినతి పత్రం అందజేశారు.ఈ ధర్నాకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మహిళ సాధికారత కోసం ప్రభుత్వ పథకాల (Government schemes_ అమలు కోసం శ్రమిస్తున్న ఐకెపి వివోఏలకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం ప్రకారం కనీస వేతనం అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

గత ప్రభుత్వ కాలంలో సమ్మె చేస్తున్న సందర్భంగా మాకు మద్దతి ఇచ్చి మేము అధికారంలోకి వస్తే మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి (revanth reddy)సీతక్క ముఖ్యమంత్రిగా పిఆర్ మినిస్టర్ గా ఉన్నారని అందుకోసం వెంటనే వి ఓ ఏ ల సమస్యల పరిష్కారాన్ని కృషి చేయాలని కోరారు. అర్హత కలిగిన వివో ఏ లను సీసీలుగా ప్రమోషన్ ఇవ్వాలని, సెర్ప్ ద్వారా గుర్తింపు కార్డులు, యూనిఫామ్, 10 లక్షల ప్రమాద బీమా కల్పించాలని డిమాండ్ చేశారు. సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చిలుముల దుర్గయ్య పొడిచేటి సులోచన* లు మాట్లాడుతూ వివో ఏలు (voal)ఎంత కష్టపడి పనిచేసిన టార్గెట్ల పేరుతో సీసీలు ఏపీఎంలు వేధిస్తున్నారని, వివో ఏలకు సంబంధం లేని ఆన్లైన్ పనులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీసీలు చేస్తున్న తప్పుల వల్ల అనేక మంది వి ఓ ఏ లకు వేతనాలు సకాలంలో రాక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ కారణాల చేత తొలగించిన వివో లందరినీ వెంటనే పనిలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ ధర్నా (darna)కార్య క్రమంలో యూనియన్ జిల్లా నాయకులు యం మంగమ్మ, కల్లూరి రేణుక, పద్మ, నాగమణి, బద్రి, సైదులు,సిఐటియు నాయకులు వెంకన్న, యూనియన్ నాయకులు లలిత, వి పద్మ, పి లలిత, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.