Election Rules: అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తన నియమవళి పాటించాలి
పార్లమెంట్ ఎన్నికల నామినేషన్లు దాఖల సమయంలో అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తన నియమాలను ఉల్లంగించరాదని,జిల్లా ఎస్పి చందనా దీప్తి తెలిపారు.
ఊరేగింపులకు అనుమతి తప్పనిసరి
ఎస్పీ చందన దీప్తి
ప్రజా దీవెన నల్గొండ: పార్లమెంట్ ఎన్నికల నామినేషన్లు దాఖల సమయంలో అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తన నియమాలను ఉల్లంగించరాదని,జిల్లా ఎస్పి చందనా దీప్తి(Chandana deepthi) తెలిపారు.పార్లమెంట్ ఎన్నికల నామినేషన్లు దాఖల సమయంలో రాజకీయ అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం నడుచుకోవాలని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజకీయ పార్టీల తరుపున అభ్యర్థులు నామినేషన్ల దాఖలు ఊరేగింపు కార్యక్రమం కొరకు అనుమతి పొందాలని, ట్రాఫిక్ సమస్య(traffic issue) తలెత్తకుండా ముందుగా పోలీసు శాఖ అధికారులకు సమాచారం అందించాలి,అభ్యర్థి అనుమతి పొందిన వాహనాలు మాత్రమే వాడాలని అన్నారు.
నిబంధనలు….
– రాజకీయ పార్టీలు అభ్యర్థి నామినేషన్ దాఖలు ఊరేగింపు సమయంలో ఎన్నికల నిబంధనలకు లోబడి నిర్వహించాలని, కుల, మత, ప్రాంత, వర్గ విబేధాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడరాదు.
– వాహనాలకు లౌడ్ స్పీకర్లు వినియోగిచుటకు సంబంధిత అధికారుల నుండి అనుమతి పొందాలి.
– అభ్యర్థి వాహనాలకి రిటర్నింగ్ అధికారి నుండి ముందస్తు అనుమతి పొందవలసి ఉంటుంది. రిటర్నింగ్ అధికారి జారీ చేసిన పర్మిట్‌ను ఒరిజినల్ కాఫీ ప్రదర్శించాలి.
– వాహనం విండ్‌స్క్రీన్‌పై పర్మిట్ వాహనం నంబర్,(vehicle number) అభ్యర్థి పేరు ఎవరికి అనుకూలంగా జారీ చేయబడిందో తప్పనిసరిగా కలిగి ఉండాలి.
– ఒక అభ్యర్థి ఊరేగింపుతో నామినేషన్ దాఖలు చేయడానికి రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి 100 మీటర్ల పరిధిలోకి రావడానికి అనుమతించబడే వాహనాల గరిష్ట సంఖ్య 3 కి మాత్రమే పరిమితం చేయబడింది.
– రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి ప్రవేశించడానికి అనుమతించబడే వ్యక్తుల గరిష్ట సంఖ్య అభ్యర్థి తో సహా 5 గురికీ మాత్రమే ప్రవేశం ఉంటుంది.
– నామినేషన్ సమయంలో రాజకీయ పార్టీలు అభ్యర్ధులు ఎవరైనా తప్పుడు అఫిడవిట్ ను సమర్పించడం లేదా అభ్యర్థి సమర్పించిన అఫిడవిట్ లో కొంత సమాచారాన్ని దాచిపెట్టి అఫిడవిట్ ను సమర్పించకూడదు.
Candidates must follow Election rules