Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Polling: పోలింగ్ లో తప్పులకు బాధ్యు లవుతారు

పోలింగ్ నిర్వహణలో పిఓ, ఏపి ఓ,ఒపీవో లు తప్పులు చేసినట్ల యితే సస్పెండ్ తో పాటు, ఎన్నికల నిబంధనల ప్రకారం కేసులు నమో దు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన హెచ్చరించారు.

ప్రజా దీవెన, దేవరకొండ: పోలింగ్(Polling) నిర్వహణలో పిఓ, ఏపి ఓ,ఒపీవో లు తప్పులు చేసినట్ల యితే సస్పెండ్ తో పాటు, ఎన్నికల నిబంధనల ప్రకారం కేసులు నమో దు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన హెచ్చరించారు. శుక్రవారం ఆమె దేవరకొండ లోని ఎంకెఆర్ డిగ్రీ కళాశాలలో పిఓ, ఏపిఓ లకు ఇస్తున్న పార్లమెంట్ ఎన్నికల(Parliament elections) 2 వ విడత శిక్షణ తరగ తుల కార్యక్రమాన్ని ఆకస్మి కంగా తనిఖీ చేశారు. ముందుగా ఇదే కళాశాలలో ఎన్నికల విధులలో ఉన్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం వినియోగించుకునేందుకు ఏర్పాటు చేసిన ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాన్ని తనిఖీ చేసి అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు.

ఎన్నికల విధులలో ఉన్న ఉద్యోగులందరూ ఓటర్ ఫెసిలిటేషన్(Voter Facilitation) కేంద్రాల కు వచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె కోరారు.అనంతరం ఇదే కళాశాలలో నిర్వహిస్తున్న పార్లమెంట్ ఎన్నికల రెండవ విడత శిక్షణ తరగతులను పరిశీలించారు. మాక్ పోల్,టెండర్ ఓటుతో పాటు, ఈవీఎం,బి యు,సి యు లను ఎలా అనుసంధానం చేయాలో అడిగి తెలుసుకున్నారు . మాక్ పోలింగ్(Mock polling) సమయము, అదేవిధంగా పోలింగ్ స్టేషన్లో చేయవలసిన విధులు, ఇతర అంశాలను శిక్షణకు హాజరైన పిఓ,ఏ పి ఓ లను అడిగారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల విధులకు నియమించబడిన ఉద్యోగులంద రూ పోస్టల్ బ్యాలెట్(Postal ballots) సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఇందుకు గాను,,నల్గొండ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో 6 ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈనెల మూడవ తేదీ నుండి 5వ తేదీ వరకు సౌకర్యాన్ని వినియోగిం చుకోవచ్చని తెలిపారు.

పిఓ,ఏపిఓ, ఇతర పోలింగ్ సిబ్బంది ఎట్టి పరిస్థితులలో పోలింగ్ పట్ల నిర్లక్ష్యంగా ఉండవద్దని, ఒకవేళ ఎవరైనా పోలింగ్ నిర్వహణలో తప్పులు చేసినట్లయితే సస్పెండ్ కావడమే కాకుండా, ఎన్నికల నిబంధనలు ప్రకారం కేసులు నమోదు అవు తాయని అన్నారు .పోలింగ్ నిర్వహణకై ఎన్నికల సంఘం జారీ చేసిన హ్యాండ్ బుక్ ను మార్గ దర్శకాలను ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా చదువు కోవాలని, ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా చూడాలని , పోలింగ్ నుఅందరూ బాధ్యతగా తీసుకోవాలని అన్నారు.

అనంతరం జిల్లా కలెక్టర్ దేవరకొండ పట్టణంలోని పాత సత్యసాయి కాలేజీ రోడ్ లో 91 సంవత్సరాలు నిండిన సీనియర్ సిటిజన్ బి ఎన్ శామ్యూల్ హోమ్ ఓటింగ్ సౌకర్యాన్ని వినియోగిం చుకోగా, వారి ఇంటి వెళ్లి ప్రత్యక్షంగా హోమ్ ఓటింగ్ విధానాన్ని పరిశీలించారు.జిల్లా కలెక్టర్ వెంట దేవరకొండ ఆర్డిఓ శ్రీరాములు, స్థానిక తహసిల్దార్ తదితరులు ఉన్నారు.

Case registered on PO-APO-OPO mistakes