ప్రజాదీవెన, నల్గొండ : మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో డిగ్రీ మరియు పీజీ కళాశాలల ప్రిన్సిపాల్ లకు తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ టాస్క్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టాస్క్ సీఈవో శ్రీకాంత్ స్నేహ హాజరై సంస్థ కార్యకలాపాలు మరియు సాధించిన విజయాలను వివరించారు.
విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపు ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అవకాశాలను చేజిక్కించుకునే ధైర్యాన్ని స్తైర్యాన్ని విద్యార్థులకు అందించవచ్చునన్నారు. విద్యార్థుల ఆవిష్కరణల ద్వారా తెలంగాణ రాష్ట్రానికి స్కోచ్ అవార్డు సైతం దక్కిన విషయాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో టాస్క్ మేనేజర్ ప్రదీప్ రెడ్డి, క్లస్టర్ మేనేజర్ సుధీర్, అక్కడ మీకు ఆడిట్ సెల్ డైరెక్టర్ వై ప్రశాంతి, వివిధ కళాశాలల ప్రిన్సిపాల్ లు పాల్గొన్నారు.