Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CH Lakshminarayana: మహిళా సమైక్య అటెండర్స్ కు వేతనాలు పెంచాలి

–సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ లక్ష్మీనారాయణ

CH Lakshminarayana:ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: మండల మహిళా సమైక్య లో అటెండర్స్ గా పనిచేస్తున్న వారందరికీ కనీస వేతనం 18వేలు వెంటనే అమలు చేయాలని సిఐటి యు జిల్లా (CIT U Distt) అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ (Lakshminarayana) ప్రభుత్వాన్ని డి మాండ్ చేశారు.మండల మహిళా సమైక్యలో పనిచేస్తున్న అటెండర్స్ కు వేతనాలు పెంచాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డి ఆర్ డి ఓ పిడి శేఖర్ రెడ్డి కి వినతి పత్రం ఇచ్చారు.

ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ (Lakshminarayana) మాట్లాడుతూ మండల మహిళ సమైక్యాలు (Women’s Associations)ఏర్పడిన నాటి నుండి కొంత మం ది,20 సంవత్సరాలుగా కొంతమంది తక్కువ వేతనాలతో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంట ల వరకు పనిచేస్తున్నారని అన్నా రు. జిల్లాలో అటెండర్స్ కి 2వేలు నుండి 6వేలు వరకు మాత్రమే వేతనాలు ఇస్తున్నారని పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలతో ఈ వేతనాలు సరిపోక వారి కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో (Financial difficulties)కొట్టుమిట్టాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ని సంవత్సరా లుగా కష్టపడి పనిచేస్తున్న వీరికి గుర్తింపు కార్డులు, పిఎఫ్ ,ఈఎస్ఐ, ప్రమాద బీమా యూనిఫాం క్యాజువల్ సెలవులు అమలు కావడం లేదని కనీసం ఉద్యోగ భద్రత కూడా లేని పరిస్థితి దాపురించిందని అన్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు వెంటనే వీళ్ళ వేతనాలు పెంచే విధంగా ఇతర సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. లేనియెడల అటెండర్స్ అందరూ పోరాటాలకు సిద్ధమవుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు పులకరం నారాయణ, జిల్లా నాయకులు ఉల్లెందుల సైదులు, సైదమ్మ, నాగమ్మ, ఎల్లమ్మ, కమలమ్మ,సరిత, సాలమ్మ తదితరులు పాల్గొన్నారు.