Chamala Kiran : ప్రజా దీవెన, తుంగతుర్తి : నల్గొండ జిల్లా శాలిగౌరారం ముద్దు బిడ్డ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని విమర్శించే స్థాయి బిఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి కి లేదని తుంగతుర్తి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వేముల గోపీ నాథ్ అన్నారు. విద్యార్థి నాయ కునిగా, యువజన కాంగ్రెస్ నాయ కునిగా పనిచేసిన చామల కిరణ్ కుమార్ రెడ్డి అనేక ఆటుపోట్ల ను,లాఠీ దెబ్బలను తట్టుకుని, రాజ కీయాలలో ఎదిగారని, చామల కిరణ్ కుమార్ రెడ్డి విద్యార్థి దశలో రాజకీయాలకు వచ్చినప్పుడు రావుల శ్రీధర్ రెడ్డి రాజకీయాలంటే ఏంటో కూడా తెలవదన్నారు.
కేవ లం కేటీఆర్ ,కేసీఆర్ మెప్పుకోసం శ్రీధర్ రెడ్డి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పై అసమర్ధ ఆరోప ణలు చేస్తే ప్రజల సహించరని హెచ్చరించారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో పోటీ పడడం నక్కకు నాగలోకానికి ఉన్న తేడాగా ఉందన్నారు.