ప్రజా దీవెన, నల్లగొండ: నకిరేకల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల లో ప్రతిభావంతులను మరింత ప్రోత్సహిస్తూ ప్రభుత్వ డిగ్రీ కళాశా ల టాపర్ కు ప్రతి ఏడాది స్వర్ణ పతకం అందించేందుకై పోలీసు శాఖ ఏసిబిలో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న చౌగాని యాదగిరి గౌడ్ ఉదారత చాటుకున్నారు. తన కుమారుడు కీ. శే. శ్యాంప్రసాద్ జ్ఞాపకార్థం ఒక లక్షా ఇరవై ఐదు వేల రూపాయిల నగదును విరాళం ఇచ్చారని కళాశాల ప్రధానాచార్యు లు డా. బెల్లి యాదయ్య తెలిపారు. పేదరికం కారణంగా పెద్దగా చదువు కోలేక చౌగాని యాదగిరి ఈ తరం విద్యార్థులు ఉన్నత విద్యలో రా ణించాలని స్వప్నిస్తుంటారు.
వీరు నకిరేకల్ మండలం పాలెం వాస్త వ్యులు. గత ఐదేండ్ల క్రింతం వీరి చిన్నకుమారుడు శ్యాంప్రసాద్ గౌడ్ చెన్నైలో ఇంజనీర్ గా పనిచేస్తూ రోడ్డుప్రమాదంలో మరణించారు. కీ.శే. శ్యాంప్రసాద్ గౌడ్ ఎన్ ఐ టి బెంగూళూరులో ఇంజనీరింగ్ అభ్యసించారు. తన కుమారుడి స్మారకార్థం గోల్డ్ మెడల్ ఏర్పర చడం సముచితంగా ఉంటుందని చౌగాని యాదగిరి గౌడ్ భావించా రు. సదరు డబ్బును కళాశాలలో శాశ్వత డిపాజిట్ గా ఉంచి దీని పైన వచ్చే వడ్డీతో ప్రతిసంవత్సరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల నకిరేకల్ టాపర్ కు శ్యాంప్రసాద్ గౌడ్ పేరు మీద గోల్డ్ మెడల్ ఇస్తామని ప్రధా నాచార్యులు చెప్పారు.
ఈ సంద ర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బడుగుబవహీన వర్గాల విద్యార్థు లను ప్రోత్సహించేందుకు స్వర్ణవ తక దాతగా ముందుకు వచ్చిన చౌగాని యాదగిరి గౌడ్ కు ప్రధానా చార్యులు కృతజ్ఞతలు తెలిపారు. స్వర్ణ పతకాల ఏర్పాటు విద్యార్థు ల్లో పోటీని పెంచి ప్రతిభ వెలికీతీ తకు దోహదపడగలని, డా. బిఆర్ అంబేడ్కర్ పే బ్యాక్ టు సొసైటీ నినాదాన్ని అందుకుని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు స్వర్ణపతక విరాళం అందించిన చౌగాని యాదగిరిని స్థానిక శాసన సభ్యులు వేముల వీరేశం, ప్రజా ప్రతి నిథులు, పట్ట ణప్రముఖులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, కళాశాల డోనర్స్ కమిటీ, సిబ్బంది అభి నందనలు తెలియజేశారు.