Chief Minister’s Relief Fund: ప్రజా దీవెన,నల్లగొండ టౌన్ : ముఖ్యమంత్రి సహాయ నిధి (Chief Minister’s Relief Fund) పేదలకువరం అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutta Sukhender Reddy) అన్నారు. వివిధ అనారోగ్య సమస్యలతో పలు ప్రైవేట్ హాస్పిటల్స్ లో చికిత్స పొందిన 44మంది నిరుపేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ద్వారా మంజూరు అయిన రూ.18,44,000 విలువ గల చెక్కులను మంగళవారం నల్లగొండ పట్టణంలోని క్యాంపు కార్యాల యంలో లబ్ధిదారులకు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్య మంత్రి సహాయనిధి పథకాన్ని (Chief Minister’s Assistance Fund Scheme)నిరుపేదలకు ఎంతో ఉపయో గకరమన్నారు. ఈ పథకం ద్వారా లక్షలాది మంది పేదలకు సహాయం అందుతుందని చెప్పారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.