— ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింత కాయల ఝాన్సీ
Chinthakayala Jhansi: ప్రజా దీవెన, నల్గొండటౌన్: నల్లగొండ జిల్లా కేంద్రంలోని స్థానిక ఏచూరి గార్డెన్ లో శనివారం రోజు ప్రారంభమైన ఏబీవీపీ రాష్ట్ర కార్య వర్గ సమావేశాల్లో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి (ABVP State Secretary) చింతకాయల ఝాన్సీ (Chinthakayala Jhansi) రాష్ట్రంలోని విద్యారంగా సమస్య లు, రాష్ట్ర సమస్యలపై మాట్లాడ డం జరిగింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు పని చేస్తామని రెండు సార్లు అధికారం చేపట్టిన తెరాస పార్టీ అప్రజాస్వామిక నిరంకుష పాలనతో తెలంగాణలో అధోగతి పాలయిందని విమర్శిం చారు. ఇప్పటికైనా కొలువుదీరిన కొత్త ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను పట్టించుకుంటదని అధికారంలోకి తీసుకొస్తే ప్రస్తుత ప్రభుత్వం కూడా విధంగానే వ్యవహరిస్తుంది. రాష్ట్రం లో పాలకులు మారిన ప్రజల బ్రతు కులు మారడం లేదన్నారు. విద్యా ర్థుల స్థితిగతులు మారడం లేదు. నేటి రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగా న్ని నిర్లక్ష్యం చేసి గాలికి వదిలేసిన తీరు ఈ రాష్ట్రంలో కనబడుతుం దన్నారు.
గతం కంటే నేడు విద్యా రంగానికి బడ్జెట్లో 6.5 % కేటాయిం చడం అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వా నికి విద్య రంగంపై ఎంత చిత్తశు ద్ధి ఉందో అవగతం అవుతుంది. గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఫీజు రీయింబర్స్మెంట్ (Reimbursement of Fees) రాక విద్యార్థులు చదువుకు దూరమై పరిస్థితి ఏర్పడ్డాయి. గురుకుల పాఠశాలలో రోజుకొక ఘటన, సంక్షేమ హాస్టల్స్ లో సంక్షోభంలో అంటే విషయాలు ఆందోళనకు గురిచేస్తుంది. పాఠశాల స్థాయి నుండి విశ్వవిద్యాలయం (University) వరకు విద్యను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. అన్ని స్థాయిల్లో విద్యను కార్పొరేట్ శక్తులకు పణంగా అప్ప జెప్పిందని రాష్ట్రంలో పాఠశాలలో కళాశాలలో విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయకుండా కాల యాపన చేస్తుందని ఆరోపించారు.
ఇప్పటికైనా యూనివర్సిటీలకు వైస్ ఛాన్సర్ నియమించి ఖాళీగా ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బందిని భర్తీ చేయాలని డిమాండ్ (demand)చేశారు. ఇక రాష్ట్ర పరిస్థితులకొస్తే రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించి పసిపాప నుంచి 60 సం,,మహిళ వరకు నిత్యం ఏదో ఒక చేతిలో అత్యాచారానికి, అవహేళనకి ప్రదేశంలో ఆకతాయి గురువుతు న్నారు. డ్రగ్స్, మద్యం మాఫియా చేతిలో యువత చిక్కుకొని చిత్తయిపోతున్నారు. రాష్ట్రంలో విష జ్వరాలు వజ్రంభించి ప్రజలు అనారోగ్యం పాలైతే ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ (Private and Corporate Hospitals) ధనార్జనే ధ్యేయంగా ప్రజలను వేధిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపో వడం సిగ్గుచేటు. స్కీముల పేరిట స్కాములకు తెరలేపి హైడ్రా పేరుతో హైడ్రామా ఆడుతుంది. అబద్ధం, అసత్యం బూటకపు మాటల ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చి ఒక్క హామీని తప్ప మిగతా హామీలన్నింటిని వదిలేసిన రాష్ట్ర ప్రభుత్వానికి గోరి కట్టే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో నెలకొని ఉన్న విద్యారంగ, రాష్ట్ర సమస్యలపై స్పందించకుండా, పట్టించుకోకుం డా కాలయాపన చేస్తే ఏబీవీపీ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నల్లగొండ విభాగ్ ప్రముఖ్ కత్తుల ప్రమోద్ కుమార్, విభాగ కన్వీనర్ సుర్వి మణికంఠ, జిల్లా కన్వీనర్ ఆవుల సంపత్ కుమార్, నగర కార్యదర్శి శివకృష్ణ, జయేందర్, గోపీచంద్ తదితరులు ఫాల్గున్నారు.