–బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్త లపై దాడులు పెచ్చుమీరుతున్నా యి
–నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరు మర్తి లింగయ్య
Chirumarthi Lingaiah: ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో ప్రజా పాలన దేవుడేరుగు గాని నరకపాలన కొనసాగుతోoదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య (Chirumarthi Lingaiah) తీవ్రస్థాయిలో ఆరో పణలు గుప్పించారు. నల్లగొండ టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి (Banda Narender Reddy)తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఎక్కడ లేని విధంగా నకిరేకల్ నియోజకవర్గంలో ప్రజా పాలన కాకుండా రౌడీ పాలన జరుగు తోoదని అన్నారు. నకిరేకల్ నియోజకవర్గం లోని 6 మండలా లలో రోజు ఏదో ఒక మండలంలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై దాడు లు జరుగుతున్నాయని, కేతే పల్లి మండలంలోని చెరుకుపల్లి గ్రామం లో ఎన్నికల ఫలితాలు వెలువడ గానే పోకల సైదులు అనే యువ కుడిని నువ్వు బిఆర్ఎస్ కార్యకర్త వoటూ కర్రలతో దాడి చేసి చెట్టుకు కట్టేసి మరి కొట్టడం జరిగింద న్నారు. ఈ విషయంపై కేతపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా తిరిగి అతనిపైనే ఎస్సై కేసు పెట్ట డం జరిగిందని, దాడి చేసింది వాళ్లే దెబ్బలు తిన్నవాళ్లపై మాత్రం కేసు నమోదు చేయడం జరిగింది.
కేత పల్లి పట్టణంలో దసరా పండుగ (Dussehra festival) రోజు ముగ్గురు వ్యక్తులు ఇంటి ముందు కూర్చొని ఉండగా 14 మంది కాంగ్రెస్ కార్యకర్తలు (Congress workers)కావా లని వాళ్లపై రాడ్లతో కర్రలతో దాడి చేసి తలలు పగిలే విధంగా కొట్టడం జరిగింది ఈ విషయంపై ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్ల గా దెబ్బలు తిన్న వ్యక్తులపైనే కేసులు పెడతానని బెదిరించడం జరుగుతుందని ఆరోపించారు. నకిరేకల్ మండలం మంగళపల్లి గ్రామంలో ప్రైవేట్ స్థలంలో 15 సంవత్సరాల క్రితం బి.ఆర్.ఎస్. పార్టీ కార్యాలయాన్ని వారి సొంత స్థలంలో నిర్మాణం చేసుకుంటే ఆ స్థలం ప్రభుత్వ స్థలంలో ఉందని రాత్రికి రాత్రే పార్టీ కార్యాలయాన్ని కూల్చివేసి అదే చోట కావాలని బొడ్రాయిని పెట్టడం జరిగిందని విమర్శించారు. నకిరేకల్ పట్టణం లోని పోలీస్ స్టేషన్లో BRS పార్టీ ప్రజా ప్రతినిధులను గేటు ముందు నుండే బయటకి పంపించే కార్యక్ర మం జరుగుతుందని, కట్టంగూరు మండలంలోని చెరువు అన్నారం గ్రామంలో గుండెగోని రాములు మాజీ ఎంపీటీసీ, తను ఇంట్లో పని చేసుకుంటూ ఉండగా కావాలని ఇంట్లోకి చొరబడి కళ్ళలో కారం చల్లి అతనిని తీవ్రంగా కొట్టి గాయ పరచడం జరిగిందని, ఈ విషయం పై కట్టంగూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యా దు చేయగా అతనిని ఒంటరిగా పిలిపించి కేసు రాజీ పడతావా లేదంటే నీపై అక్రమ కేసులు పెట్టమంటావా అని ఎస్సై పోలీస్ స్టేషన్లో బెదిరించడం జరిగిందని వివరించారు.
అదేవిధంగా కట్టం గూరు మండలం దుగనెల్లి గ్రామం లో దసరా పండుగ రోజు తన ఇంటి ముందు బాణాసంచా కాల్చుతుండగా కావాలని కొంత మంది కాంగ్రెస్ వ్యక్తులు (Congress people)అతనిపై గొడవకు వెళ్లి వాళ్ళని కొట్టి వాళ్లపై కేసు పెట్టించడం జరిగిందని, నకిరే కల్ నియోజకవర్గంలో పోలీస్ యం త్రాంగానికి చెప్తున్నది ఏమిటంటే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం చట్ట ప్రకారం మీ పరిధిలో మీరు పని చేయండి కాదని అధికార పార్టీలోని నాయకు లకు తొత్తులుగా మారి బి.ఆర్. ఎస్. పార్టీ కార్యకర్తలకు పై గాని నాయకులపై గాని దాడులకు దిగితే సహించేది లేదని హెచ్చ రించారు. నకిరేకల్ నియోజకవర్గం లో బి.ఆర్.ఎస్. పార్టీ కార్యకర్తలపై కావాలని దాడులు చేపిస్తూన్నారు స్థానిక ఎమ్మెల్యే ఏది చెప్తే పోలీసు యంత్రాంగం అది చేయడం సరికా దన్నారు. రాష్ట్రస్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి నోటి దురుసుతో ప్రజలను భయపెడుతూ హైడ్రా పేరుతో పేద ప్రజలను ఇబ్బందు లకు గురిచేస్తున్నాడని ధ్వజమె త్తారు. నకిరేకల్ నియోజకవర్గంలో కూడా అదే జరుగుతుంది పేద ప్రజలకు న్యాయం చేయాల్సినది పోయి వారే కావాలని వారిపై దాడులు చేయిస్తున్నారని, ఈ పద్ధ తులు మార్చుకోవాలని ఇటువంటి పద్ధతులు సరైన ఒక అవని హెచ్చ రించారు.
ఒక ఎమ్మెల్యేగా (mla) వీలైతే మేము చేసిన అభివృద్ధి పనులు మీరు 50% చేసి చూపించు అంతే కానీ ఈ చిల్లర కార్యక్రమాలు ని త్యం గొడవలు పెడుతూ కార్యక ర్తలను ఇబ్బంది పెడుతూ కాలం గడిపే ప్రయత్నం చెయ్యకoడని హితవు పలికారు. మీ ప్రభు త్వానికి ప్రజలు ఇచ్చిన సమ యంలో పది నెలలు గడిచిపో యింది ఇప్పటివరకు ఏ ఒక్క చోట కూడా అభివృద్ధి పని జరగలేదని, ముందు నియోజకవర్గంలోని గ్రామా లలో అభివృద్ధి జరిగే విధం గా మాతో పోటీ పడాలి తప్ప చిల్ల ర రాజకీయాలతో కాదన్నారు. పోలీస్ యంత్రాంగం ఉన్నది అన్యా యం జరిగిన వాడికి న్యాయం చేయడానికి అంతేకానీ డబ్బుల కోసం బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు స్టేషన్లో కొట్టి వారి దగ్గర డబ్బులు వసూలు చేసి కాంగ్రెస్ వల్ల ఇంటికి పంపడం కాదన్నారు. ఇదే కనుక ఇక ముందు జరుగుతే జిల్లా ఎస్పీ ఆఫీస్ ముందు బి.ఆర్.ఎస్. పార్టీ రాష్ట్ర నాయకత్వంతో ధర్నా నిర్వ హించడం జరుగుతుందన్నారు.