Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Chityala Ailamma: ఘనంగా చిట్యాల ఐలమ్మ 39వ వర్ధంతి

Chityala Ailamma: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: మోడరన్ దోబిఘాట్ (Modern Dobighat) అధ్యక్షుడు యలిజాల శంకర్ ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలో వీటి కాలనీ రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద మోడరన్ దోబిఘాట్ అధ్యక్షుడు యలి జాల శంకర్ ఆధ్వర్యంలో తెలంగా ణ రైతాంగ సాయుధ పోరాట యో ధురాలు చిట్యాల ఐలమ్మ (Chityala Ailamma) 39వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వ హించుకోవడం జరిగింది. ఈ సంద ర్భంగా యలిజాల శంకర్ (Yalijala Shankar), దూదిగా మ నాగరాజు మాట్లాడుతూ బహు జన చైతన్యానికి, మహిళా శక్తికి ప్రతీక చాకలి ఐలమ్మ గారని, తెలం గాణ తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత అని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ కనబరిచిన ధైర్య సాహ సాలను స్మరించుకున్నారు. ఐలమ్మ (Ailamma) ప్రేరణతో అనేక మంది మహిళలు నాటి భూ పోరాటానికి ముందుకు వచ్చారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ పట్టణ రజక నాయకులు ఓరుగంటి ఐలయ్య, తుపాకుల ప్రసాద్, యలిజాల సంతోష్ కుమార్, మారగోని సుధాకర్, దూదిగామ శంకర్, భూతరాజు రాంబాబు, చిలకరాజు రాజు, పగిల్ల సైదులు, గణేష్, తదితరులు పాల్గొన్నారు