— నల్లగొండ ట్రాఫిక్ సిఐ రాజు
CI Raju : ప్రజా దీవెన, నల్లగొండ :నల్లగొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్, రామ గిరి, ఓల్డ్ సిటీ, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాల్లో నిబంధనలకు విరు ద్ధంగా నో పార్కింగ్ లో వాహనాలు నిలిపి, ప్రజలకు ఇబ్బంది కలిగి స్తున్న వాహనాలను జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు దాదాపు 50 వాహనాలను వెహికల్ లిఫ్టింగ్ (Vehicle lifting of vehicles)(టొయింగ్ వెహికిల్ ) ద్వారా పోలీస్ స్టేషన్ కు తరలించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని ట్రాఫిక్ సిఐ రాజు (CI Raju) తెలిపారు. పట్ట ణంలో వాహనదారులకు, ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బంది కలిగించే విధంగా వాహనాలు ఎక్కడబడితే అక్కడ నిలిపితే చర్యలు తప్పవని అన్నా రు. వాహనదారులు తమ వాహ నాలను నో పార్కింగ్ నందు పార్క్ చేసిన, రాంగ్ రూట్ (Wrong route) వెళ్ళినా చర్యలు తప్పవని, కావున ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సహకరించాలని అన్నారు.