CITU: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: సిఐటియు (CITU)అఖిలభారత కమిటీ పిలుపుమేరకు కేరళ రాష్ట్రంలోని వయనాడు వరద బాధితుల సహా యార్థం నలగొండ పట్టణంలో విరాళాలు సేకరించడం (Collecting donations) జరిగిందని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేరళ రాష్ట్రంలో అత్యంత అమాను షమైన విధంగా వరద బీభత్సంలో వందలాదిమంది మరణించారని వేలాదిమంది క్షతగాత్రులై చికిత్స పొందుతున్నారని వారిని ఆదుకో వడానికి మానవత్వం కలిగిన ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరా రు. కేంద్రం జాతీయ విపత్తుగా ప్రక టించి తక్షణం ఆర్థిక సహాయం అం దించాలని కోరారు.
వివిధ రాష్ట్రా లు ,సినిమా క్రీడా వివిధ రంగాలను (States, films, sports, various fields)మేధావులు ఆర్థిక సహకార అంది స్తున్నారని అదేవిధంగా నల్గొండ పట్టణంలో ఆర్థికంగా సహకారం అందించిన ప్రజలందరికీ సిఐటియు పట్టణ సమన్వయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేశారు అనం తరం ఈరోజు సేకరించిన రూ. 12,1 40 రూపాయలు సిఐటియు (citu)జిల్లా కోశాధికారి బాణాల పరిపూర్ణాచారి కి అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ, సలివోజు సైదాచారి, కత్తుల యాదయ్య పల్లె నగేష్, విశ్వనాధుల శ్రీనివాస చారి, చంద్రశేఖర్, బత్తినోజు సైదాచారి తదితరులు పాల్గొన్నారు