CITU: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: యాభై సంవత్సరాలు నిండిన భవన నిర్మాణ కార్మికులకు నెలకు 6000 పెన్షన్ ఇవ్వాలని సిఐటియు (CITU) జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం (MD Salim) జిల్లా సహాయ కార్యదర్శి దండెంప ల్లి సత్తయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ (demand)చేశారు. గురువారం సుందరయ్య భవన్లో పెయింటింగ్ వర్కర్స్ యూనియన్, కార్పెంటర్ వర్కర్స్ యూనియన్ ల జనరల్ బాడీ సమావేశాలు వేరువేరుగా జరి గాయి. ముఖ్యఅతిథిగా హాజరైన వారు మాట్లాడుతూ నిర్మాణ రంగం నుండి ఒక శాతం పన్ను ద్వారా జమ అవుతున్న సంక్షేమ బోర్డు నిధులను ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి ఉపయోగించకుండా పక్కదారి పట్టిస్తుందని ఆరో పించారు. గత ప్రభుత్వం ద్విచక్ర వాహనాలను ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పిందని కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన భవనిర్మాణ కార్మికులందరికీ ద్విచక్ర వాహనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సంక్షేమ బోర్డు (Welfare Board) ద్వారా 50 సంవత్సరాలు నిండిన భవన నిర్మాణ కార్మికులకు నెలకు 6000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని, సాధారణ మరణానికి ఇస్తున్న లక్ష 30 వేల రూపాయలను 5 లక్షలకు పెంచాలని, ప్రమాద మరణానికి ఇస్తున్న ఆరు లక్షల 30 వేలను పది లక్షలకు పెంచాలని, ప్రసూతి, వివాహ కానుకలను 30,000 నుండి లక్ష రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. లేబర్ కార్డులో (In labor card) కుటుంబ సభ్యుల చేర్పిం పు, ఆధార్ అప్డేట్ చేయడానికి ఏ ఎల్ ఓ కు అనుమతించాలని, కార్మిక శాఖ కార్యాలయంలో ఖాళీ గా ఉన్న ఉద్యోగుల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం నలగొండ పట్టణ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ గా భీమ నపల్లి శంకర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వేర్వేరుగా జరిగిన ఈ సమావేశాల లో తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ (Construction Workers Union) పట్టణ అధ్యక్షుడు సలివోజు సైదాచారి, పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ పట్టణ అధ్యక్షుడు కత్తుల జగన్, కార్యదర్శి జి రమేష్, కోశాధికారి బైరు నరసింహ, కార్పెంటర్ యూనియన్ కార్యదర్శి దాసోజు ప్రభు చారి, ఉపాధ్యక్షులు ఆంజనేయులు సోమయ్య చారి శ్రీనివాస చారి తదితరులు పాల్గొన్నారు.