Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MayDay: కార్మిక వర్గ రాజ్యస్థాపనే సిఐటియు లక్ష్యo

దోపిడి రహిత కార్మిక వర్గ రాజ్య స్థాపన సిఐటియు లక్ష్యమని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరా రెడ్డి జిల్లా సీనియర్ నాయకులు సయ్యద్ హశం,జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య లు అన్నారు.

ప్రజా దీవెన, నల్లగొండ టౌన్:దోపిడి రహిత కార్మిక వర్గ రాజ్య స్థాపన సిఐటియు లక్ష్యమని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరా రెడ్డి జిల్లా సీనియర్ నాయకులు సయ్యద్ హశం,జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య లు అన్నారు. బుధవారం ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా పట్టణంలో హమా లీ ,భవన నిర్మాణం , పవర్ లూం మ్ ,ఆటో, మోటార్ ట్రాన్స్పోర్ట్, మున్సిపల్, టైలరింగ్, మిషన్ భగీరథ ,సామిల్, కార్పెంటర్స్, సెంట్రింగ్, ఆర్టీసీ ఎస్ డబ్ల్యూ ఎఫ్, ఎలక్ట్రిసిటీ స్టోర్, ఎఫ్ సి ఐ, బేవరేజెస్, వ్యవసాయ మార్కెట్ యార్డ్ ,పట్టణ ఎగుమతి దిగుమతి అమాలి తదితర యూనియన్ కార్యాలయాలు పని ప్రదేశాలలో సిఐటియు జెండా ఆవిష్కరణ అనంతరం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుండి మిర్యాలగూడ రోడ్, ప్రకాశం బజార్, మైసయ్య సర్కిల్ ,పెదగడియారం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా మాట్లాడుతూ అమెరికా చికాగో నగరంలో 8 గంటల పని విధానం కోసం జరుగుతున్న పోరాటం పై యాజమాన్యాల దాడికి బలైన అమరుల రక్తంలో నుండి పుట్టిన ఎర్రజెండా అనేక ఉద్యమాలు నిర్వ హించి కార్మిక హక్కులు సాధించిన ది అని అన్నారు. కార్మికుల శ్రమశక్తి ద్వారా సాధించుకున్న ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేటు శక్తులకు తాకట్టు పెడుతున్న బిజెపి మోడీ ప్రభుత్వాన్ని గద్దే దింపడానికి కార్మిక వర్గం సన్నద్ధం కావాల్సిందని అన్నారు కార్మిక చట్టాల మార్పులు 8 గంటల పని విధానాన్ని తీసివేసి పన్నెండు గంటలు పని విధానాన్ని ప్రవేశపెట్టాలని చూడడం అన్యాయమని అన్నారు.

అంబానీ ఆదానీలకు ఆస్తులు కట్టబెడుతూ పేదలను కార్మికులను అణిచి వేస్తున్నారని అన్నారు విద్యుత్ సంస్కరణలు రైతు వ్యతిరేక విధానాలను తీసుకువచ్చిన కేంద్ర ప్రభుత్వంపై రైతాంగం సంవత్సరం పాటు పోరాడిన సందర్భంలో చట్టా లను రద్దు పరుస్తున్నామని హామీ ఇచ్చి దొంగ చాటుగా అమలు చేయడానికి కుట్ర చేస్తున్నారని ఆరో పించారు.

మే డే స్ఫూర్తితో కార్మి క కర్షక ఐక్యతతో ప్రజా వ్యతి రేక విధానాల అవలంబిస్తున్న బిజెపిని వచ్చే ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ సాగర్ల యాదయ్య చలివోజు సైదాచారి పల్లె నగేష్ మారయ్య కత్తుల యాదయ్య బుర్ర లింగస్వామి చల్లా యాదయ్య లొడంగి ఉపేందర్ గంజి నాగరాజు బుచ్చి రాములు దొమ్మాటి సైదులు ధీరావత్ హనుమంతు నాయక్ కందుల అంజయ్య సాగర్ల మల్లయ్య బచ్చలకూరి గురువయ్య పాక మల్లయ్య ఉంగరాల సైదులు రాపర్తి లక్ష్మీనారాయణ రావుల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

CITU goal is labour rulling