CITU: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: కాంట్రాక్ట్ ఏజెన్సీలను రద్దుచేసి ప్రభుత్వమే నేరుగా జీతాలు చెల్లించాలని సెప్టెంబర్ 28న కలెక్టరేట్ ముందు 30న హైదరాబాద్ లేబర్ కమిషనరేట్ (Hyderabad Labor Commissionerate) ముందు జరిగే ధర్నాలు జయప్రదం చేయాలని సిఐటియు (CITU)జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య పిలుపునిచ్చారు. గురువారం సిఐటియు రాష్ట్ర కమిటీ మేరకు పట్టణంలో వివిధ రంగాల కాంట్రాక్ట్ కార్మికుల సర్వే నిర్వహించడం జరిగింది. ఎఫ్సిఐ కాంట్రాక్ట్ క్యాజువల్ కార్మికులకు ధర్నాల కరపత్రాన్ని పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు గత 20 సంవత్సరాలకు పైగా వివిధ శాఖలలో అతి తక్కువ వేతనాలతో, తీవ్రమైన పని భారంతో చాకిరీ చేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగ భద్రత లభిస్తుందని కుటుంబాలకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఎన్నో ఆశలు ఆకాంక్షలతో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగస్వాములు అయ్యారని గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్రం (Telangana State) ఏర్పడి పది సంవత్సరాలు పూర్తయిన కాంట్రాక్టు వ్యవస్థ రద్దు చేయకపోవడం గత పాలకుల దగా తప్ప మరొకటి కాదని అన్నారు. ఇప్పటి కి అనేక ప్రభుత్వ డిపార్ట్మెంట్లో ప్రతినెల వేతనాలు సక్రమంగా చెల్లించడం లేదని, పని ఒత్తిడి ,ఆర్థిక భారం, అధికారుల వేధింపులు తదితర సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 1,40,000 మందిపైగా ప్రభుత్వ ఔట్సోర్సింగ్ ,ఎన్ ఎమ్ ఆర్, డైలీ వేజ్ తదితర సిబ్బందిని దశలవారీగా పర్మినెంట్ చేయాలని, అప్పటిలోగా సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ (Contract Outsourcing)సమస్యలపై సెప్టెంబర్ 1 నుండి 30 వరకు దశల వారి ఆందోళనలో భాగంగా సర్వేలు నిర్వహించడం జరిగిందని 28న జిల్లా కలెక్టరేట్ ముందు 30న హైదరాబాద్ రాష్ట్ర లేబర్ కమిషనర్ కార్యాలయం ముందు జరుగు ధర్నా లలో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగ, కార్మికులందరూ పాల్గొని జయ ప్రదం చేయాలని పిలుపు నిచ్చా రు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు పల్లె నగేష్, ఎఫ్ సి ఐ కాంట్రాక్ట్ క్యాజువల్ వర్కర్స్ యూనియన్ నాయకులు మాండ్ర శ్రీనివాస్, రాజు, వెంక న్న ,శంకర్ తదితరులు పాల్గొ న్నారు