CITU: కార్మికవర్గ ఐక్య పోరాటాల సారధి సిఐటియు
కార్మిక వర్గాన్ని ఒక వర్గంగా ఐక్యం చేసి దోపిడీ రహిత కార్మిక వర్గ రాజ్య స్థాపన లక్ష్యంగా 1970లో సిఐటియు ఆవిర్భవించిందని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మ ల వీరారెడ్డి పిలుపు నిచ్చారు.
ఘనంగా 54వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: కార్మిక వర్గాన్ని ఒక వర్గంగా ఐక్యం చేసి దోపిడీ రహిత కార్మిక వర్గ రాజ్య స్థాపన లక్ష్యంగా 1970లో సిఐటియు(CITU) ఆవిర్భవించిందని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మ ల వీరారెడ్డి పిలుపు నిచ్చారు. గురు వారం నల్గొండ పట్టణంలోని హమా లీ యూనియన్(Hamalee Union)కార్యాలయం దగ్గర సిఐటియు పట్టణ సమన్వయ కమి టీ ఆధ్వ ర్యంలో 54వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జండా ఆవిష్కరణ కేక్ కటింగ్ చేసుకుని వేడుకలు ఘనంగా నిర్వహించు కొని సభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడు తూ 1970 మే 30న కలకత్తా నగ రంలో ఏర్పడిందని అన్నారు కార్మిక వర్గ సమస్య పరిష్కారం కోసం సిఐటియు పోరాడుతూనే దేశ సమైక్యత సార్వభౌమత్వం సమ గ్రత ప్రజాస్వామ్య హక్కుల కోసం సిఐటియు నిరంతరం పోరాడుతు న్నదని అన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న నయా ఉదారవాద విధానాల వల్ల కార్పొ రేట్ సంస్థలు పారిశ్రామిక వేత్తలు తప్ప చిన్న, మధ్య తరహా పరిశ్ర మల యజమానులు వేలాదిమంది ఉద్యోగులు కార్మికులు(workers) రైతులు వ్యవసాయ కార్మికులు సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారని అన్నారు. కార్పొరేట్ల ప్రయో జనాల కోసం ప్రజల హక్కులను పాలకులు హరిస్తున్నారని ఆరోపిం చారు. కార్మిక వర్గానికి ఉద్యోగ భద్రత గౌరవప్రదంగా బతికేందుకు కనీస వేతనాలు(Wages) అందాలన్నా కార్మిక చట్టాలు రక్షించబడాలన్న కార్మికుల సంక్షేమానికి ఉపయోగ పడే విధంగా సిఐటియు అనేక పోరాటాలు నిర్వహించిందని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం కార్మికు లు పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను చట్టాలను రద్దు చేస్తూ నాలుగు లేబర్ కోడ్ లను తెచ్చిం దని, ప్రజలకు, రైతులకు నష్టదాయ కమైన విద్యుత్ సవరణ బిల్లు, ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ల కు అమ్ముతూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, నేషనల్ మనిటై జేషన్ పైప్ లైన్ వంటి చర్యలతో ప్రభుత్వ రంగ సంస్థల ను బలహీన పరుస్తుందని ఆరోపించారు. బ్యాంకులు, బీమా సంస్థల పరిరక్షణ కోసం అనేక ఉద్యమాలు నిర్వహించామని గుర్తు చేశారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ(Chinapaka Lakshminarayana) మాట్లా డుతూ మెడికల్ రిప్స్ కి చట్టబద్ధ మైన పని పరిస్థితులు, పని గంట లు ,కనీస వేతనాల ఫైనల్ నోటి ఫికేషన్, మందుల ధరలపై జిఎస్టి ఎత్తివేయాలని, కార్మికు లందరికీ కనీస వేతనం 26000 అమలు చేయాలని, అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత ,సంక్షేమ పథకాల కోసం ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ సెక్యూరిటీ గార్డ్స్ ,హమాలీ కార్మికులకు సంక్షే మ బోర్డులు ఏర్పాటు చేయా లని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధుల దుర్వినియో గానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో(Assembly) ఇచ్చిన హామీ ప్రకారం కార్మికులంద రికీ మోటార్ సైకిల్ ఇవ్వాలని, మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనాలు, పని భద్రత, స్వచ్ఛంద సంస్థలకు అప్పజెప్పడానికి వ్యతిరేకిస్తూ పోరాటాలు, అంగన్వాడీ ,ఆశ, ఐకెపి వివో ఏ, ఫీల్డ్ అసిస్టెంట్స్, ఎన్ఆర్ హచ్ఎంలలో పనిచేస్తున్న వారికి కార్మిక చట్టాలు అమలు చేయాలని కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేయాలని సిఐటియు అనేక పోరాటాలు నిర్వహించిందని, భవిష్యత్తులో మరిన్ని పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండెంల్లి సత్తయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ, భవన నిర్మాణ కార్మిక సంఘం పట్టణ అధ్యక్షులు సలివోజు సైదాచారి, పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ పట్టణ అధ్యక్షుడు గంజినాగరాజు, ఎలక్ట్రిసిటీ స్టోర్ అమలు వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు కత్తుల యాదయ్య, నలగొండ పట్టణ ఎగుమతి దిగుమతి అమాలి యూనియన్ అధ్యక్షుడు హౌరేష్ మారయ్య , కార్యదర్శి కాడింగ్ రవికుమార్, మెడికల్ సేల్స్ రిప్రజెంటిటీస్(Medical Sales Representatives) యూనియన్ నల్గొండ బ్రాంచ్ అధ్యక్షులు చెరుపల్లి నిరంజన్, కార్యదర్శి రావుల రవికుమార్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గుండమల్ల శ్రీనివాస్, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ పేర్ల సంజీవ, నల్గొండ పట్టణంలోని వివిధ యూనియన్ల అధ్యక్ష కార్యదర్శులు సభ్యులు వీరబాబు వెంకన్న నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
CITU movement for labour