CITU:ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కార్పొ రేషన్, మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికు లందరినీ (All contract and outsourcing workers) పర్మినెంట్ (permant)చేయాలని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలోజూన్ 26న జరుగు కలెక్టరేట్ ధర్నా జయప్రదం చేయా లని సీఐటీయూ (CITU)జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య కోరారు. మంగళవారం మునిసిపల్ కార్మికుల (Municipal workers) హాజరు పాయింట్ దగ్గర ధర్నా జయప్రదం చేయాలని ప్రచారం నిర్వహించారు. ఈ సంద ర్భంగా సత్తయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో మున్సిపాలిటీలలో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ సేవలను థర్డ్ పార్టీకి అప్పజెప్పాలనే ప్రభుత్వ నిర్ణయాన్నిఉపసంహరించుకోవాలనిగతంలో ఉమ్మడి రాష్ట్రంలో అలా చేయడం వల్ల కార్మికులకు నష్టం జరిగిన విషయం గుర్తుకు చేశారు. అలాగే ప్రభుత్వం ప్రకటించబోయే 2వ పి.ఆర్.సిలో కనీస వేతనం 26 వేల రూపాయలుగా నిర్ణయించాలని, అలాగే జీవో నెంబర్ 60 & 63లో సూచించిన విధంగా మున్సిపల్ లో వివిధ విభాగాల కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులకు కేటగిరీలవారిగా వేతనాలు కొనసాగించాలని, మునిసిపల్ లో పని చేస్తూ చనిపోయిన కార్మికులకు దహన (మట్టి)ఖర్చులు 30వేల రూపాయాలు ఇవ్వాలని, కార్మికులు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలు పరిష్కారం చేయడంలో స్థానిక, కమిషనర్లు,చైర్మన్ లు,మేయర్లు పట్టించుకోవడం లేదని అన్నారు. అలాగే 26 న నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగే మునిసిపల్ ఉద్యోగ కార్మికుల ధర్నా లో (Dharna of municipal employees) జిల్లాలోని అన్ని మునిసిపాలిటీ ల నుండి పెద్ద ఎత్తున కార్మికులు తరలి రావాలని పిలుపునిచ్చారు.ఈ ప్రచార కార్యక్రమంలో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ పేర్ల సంజీవ కార్యదర్శి పెరిక కృష్ణ, తీగల ఎల్లమ్మ దాసరి జానమ్మ కిరణ్మయి దేవరకొండ నరసింహ దాసరి అనూష తదితరులు పాల్గొన్నారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.