CITU: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: గ్రామ పంచాయతీ కార్మికులకు పండగ పూట పస్తులతో ఉంచ కుండా పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వా లని,మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందర ఇచ్చిన వాగ్దానాలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) (CITU)యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు సుధాకర్ ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం గ్రామపంచాయతీ కార్మికుల సమ స్యలు పరిష్కరించా లని యూని యన్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నల్లగొండ కలెక్టరేట్ (Nalgonda Collectorate) ముందు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రామపంచాయతీలలో పారిశుద్ధ్యం మంచినీటి సరఫరా వీధిలైట్ల నిర్వహణ పన్నుల వసులు తదితర పనులు నిర్వహిస్తు ప్రజలకు అనేక సేవలు అందిస్తున్న గ్రామపంచాయతీకార్మికుల (Village panchayat workers)పట్ల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మేము అధికారంలోకొస్తే గ్రామపంచాయతీ కార్మికుల కనీస వేతనాలు పెంచుతామని, అర్హత కలిగిన వారిని పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చారని వాటి అమలుకు ఎలాం టి చర్యలు తీసుకుందో చెప్పాలని డిమాండ్ చేశారు.
యూనియన్ జిల్లా కార్యదర్శి సిహెచ్ లక్ష్మీనారా యణ (CH Lakshminarayana)మాట్లాడు తూ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా కష్టాలు పోతాయని ఆశపడ్డ కార్మికులకు వారి సమస్యలు పరిష్కారం కాకపోగా మరింతగా పెరిగాయని విమర్శించారు.ఇప్పటికైనా ప్రభుత్వానికి గ్రామపంచాయతీ కార్మికుల పైన ఏమాత్రం ప్రేమ ఉన్న మల్టీపర్పస్ వర్కర్స్ తో సంబంధం లేకుండా అందరికీ వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరారు. కార్మికుల ఉద్యోగ భద్రతకు (Job security of workers)ముప్పుగా ఉన్న మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, కనీస వేతనాలు చెల్లించాలని అర్హత కలిగిన కార్మికులను పర్మినెంట్ చేయాలని, ప్రమాద బీమా 10 లక్షలు చెల్లించాలని,బిల్ కలెక్టర్ కారోబార్లకు ప్రత్యేక హోదా కల్పించాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా నాయకులు పోలే సత్యనారాయణ (CITU district leaders Pole Satyanarayana)యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పి వినోద్ కుమార్ జిల్లా నాయకులు ఏర్పుల సైదులు,పి సర్వయ్య,ఎర్ర అరుణ, కె స్వప్న, లింగయ్య, కె మంగారెడ్డి నరసయ్య,జానయ్య, రామలింగయ్య, చంద్రయ్య,మరియమ్మ, అనుక్ , ఏసు తదితరులు పాల్గొన్నారు.