CITU: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్ : తెలంగాణ రాష్ట్రంలో వివిధ రవా ణా రంగాలలో పనిచేస్తున్న కార్మి కులందరికీ సంక్షేమ బోర్డు (All Workers Welfare Board)ఏర్పాటు చేయాలని తెలంగాణ పబ్లిక్ అండ్ ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడ రేషన్ (సిఐటియు) (CITU) నల్గొండ జిల్లా కార్యదర్శి సిహెచ్ లక్ష్మీనారాయణ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాం డ్ చేశారు.తెలంగాణ పబ్లిక్ అండ్ ప్రైవేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (సిఐటియు) *జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం స్థానిక దొడ్డి కొమరయ్య భవన్ లో పి సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లా డుతూ తెలంగాణ రాష్ట్రం లో 12 లక్షల మంది రవాణారంగ కార్మి కులు పనిచేస్తున్నారని వీరం దరి సంక్షేమం కోసం ప్రభుత్వం ఒక బోర్డు ఏర్పాటు చేసి ప్రమాద బీమా, పెన్షన్, ఆరోగ్య బీమా తదితర సంక్షేమ పథకాలు అమలు చేయా లని డిమాండ్ (demand) చేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం రవాణా రంగాన్ని బడా కార్పొరేట్ పెట్టుబ డిదారులకు అప్పజెప్పడా నికి తహతలాడుతుం దని విమర్శించారు.
నూతన మోటార్ వాహన చట్టం (Motor Vehicle Act) ద్వారా విపరీత మైన ఫైన్స్ వేస్తున్నారని హిట్ అండ్ రన్ తో రోడ్డు ప్రమాదాలకు డ్రైవర్ల నే బాధ్యులుగా చేస్తూ పెద్ద నేరా లకు వేసే శిక్షలను పైన్స్ వేస్తున్నార ని ఆవేదన వ్యక్తం చేశారు. డీజిల్ పెట్రోల్ ధరలు స్పేర్ పార్ట్స్ సీట్ టాక్స్ రోడ్ టాక్స్ విపరీతంగా పెంచి రవాణా రంగాన్ని తీవ్ర సంక్షోభం వైపు నడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై రవాణా రంగ కార్మికులు ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రవాణా రంగ కార్మికుల సంక్షేమ బోర్డు కోసం ఆగస్టు 20 నుండి సెప్టెంబర్ 15 వరకు సంతకాల సేకరణ (Collection of signatures), సెప్టెంబర్ 23న కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాకు కార్మికులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకులు నాగటి జోసెఫ్, పేర్వాల రాములు, నగేష్, జానయ్య, పొడిచేటి లింగస్వామి, జక్కల గణేష్, పి సాయి, ఎండి సద్దాం తదితరులు పాల్గొన్నారు.